Begin typing your search above and press return to search.

4వేల మంది రైతుల ప్రాణాలు పోయాక రైతుబంధా?

By:  Tupaki Desk   |   12 Oct 2018 4:23 AM GMT
4వేల మంది రైతుల ప్రాణాలు పోయాక రైతుబంధా?
X
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైన్ విజ‌య‌శాంతి మ‌రోసారి మాట‌ల‌తో విరుచుకుప‌డ్డారు. తెలంగాణ రాష్ట్ర ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు ఒక‌ప్పుడు దేవుడిచ్చిన చెల్లెలుగా వ్య‌వ‌హ‌రిస్తూ ఆయ‌న్ను ద‌గ్గ‌ర నుంచి అతి కొద్దిమందిలో కేసీఆర్ ఒక‌రు.

అలాంటి ఆమె.. టీఆర్ ఎస్ ను వ‌దిలేసి.. కాంగ్రెస్ లో చేరిపోవ‌టం.. ఆ త‌ర్వాత కామ్ గా ఉన్న రీల్ రాముల‌మ్మ ఇటీవ‌ల కాలంలో మ‌ళ్లీ గొంతు స‌వ‌రించుకున్నారు. కొంత‌కాలంగా ఆరోగ్య ప‌రిస్థితి స‌రిగా లేద‌ని.. తాజాగా అన్ని సెట్ అయ్యాయ‌ని చెబుతున్న విజ‌య‌శాంతి ఆప‌ద్ద‌ర్మ సీఎంగా వ్య‌వ‌హ‌రిస్తున్న కేసీఆర్ పైన నేరుగా మాట‌ల ఫైటింగ్ కు తెర తీశార‌ని చెప్పాలి.

తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో పాల్గొన్న కేసీఆర్ కు.. పాల‌కుడైన ఆయ‌న‌కు ఏ మాత్రం పోలిక లేద‌న్నారు. తెలంగాణ ప్ర‌జ‌లు గ‌త ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ కు ఓటు వేసి కేసీఆర్‌ ను ముఖ్య‌మంత్రిని చేశార‌ని.. త‌మ నిర్ణ‌యంలో త‌ప్పులో కాలేశామా? అన్న భావ‌న ప్ర‌జ‌ల‌కు క‌ల‌గ‌టం ఖాయ‌మంటున్నారు. నాలుగేళ్ల కేసీఆర్ పాల‌న‌లో సీఎం హోదాలో కేసీఆర్ భారీగా దోచుకున్నారంటూ తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గ‌త ఎన్నిక‌ల్లో గెలుస్తుంద‌ని.. దాంతో ప్ర‌జ‌ల‌కు మేలు చేయాల‌నుకున్న‌ట్లు చెప్పారు.

ఉద్య‌మం నాటి కేసీఆర్ కు.. అధికారం చేతిలో ఉన్న సీఎంకు సంబంధం లేద‌న్న విజ‌య‌శాంతి.. కేసీఆర్ తీరును తీవ్ర‌స్థాయిలో ఎద్దేవా చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ వైపు గాలి వీచింద‌ని.. ఉద్య‌మంలో కేసీఆర్ ప‌ని చేశారు కాబ‌ట్టి.. ప్ర‌జ‌లు అధికారాన్ని ఆయ‌న‌కు అప్ప‌జెప్పారన్నారు. అయితే.. నాలుగున్న‌రేళ్ల కాలంలో భారీ దోపిడీకి గురి చేశార‌న్నారు. సీఎంగా ఉన్న కేసీఆర్‌.. త‌న వైరి ప‌క్షాల‌ను ఉద్దేశించి తిట్లతో మ‌ర్యాద త‌గ్గిస్తున్నార‌ని.. ప‌రుష ప‌ద‌జాలాన్ని స్వేచ్ఛ‌గా వాడేస్తున్నార‌న్నారు. ప్ర‌జ‌లు ఓట్లు వేసింది కేసీఆర్ కుటుంబం కోసం కాద‌ని.. ప్ర‌జా సంక్షేమం కోస‌మ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దున్నారు.

తెలంగాణ రాష్ట్రం వ‌చ్చిన త‌ర్వాత నాలుగు వేల మంది రైతులు బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డిన‌ట్లు విజ‌య‌శాంతి వెల్ల‌డించారు. ఇంత భారీగా రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న రాష్ట్రం మ‌రొక‌టి లేద‌న్న విజ‌య‌శాంతి ఆ వైఫ‌ల్యాన్ని క‌ప్పిపుచ్చుకోవ‌టానికి వీలుగా రైతుబంధు ప‌థ‌కాన్ని స్టార్ట్ చేశార‌న్నారు. కేజీ టు పీజీ అంటూ ఊరించిన కేసీఆర్‌.. త‌న ప్ర‌భుత్వ హ‌యాంలో ఐదువేల స్కూళ్లు మూయించ‌టం వెనుక మ‌ర్మ‌మేంది? అని ప్ర‌శ్నించారు. ప్ర‌గ‌తిభ‌వ‌న్ లో కూర్చొని పాలిస్తున్న కేసీఆర్‌.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రాక‌పోవ‌టాన్ని ఎత్తి చూపిన విజ‌య‌శాంతి మాట‌ల‌కు ఆయ‌న ఎప్ప‌టికి స్పందిస్తారో చూడాలి.