Begin typing your search above and press return to search.
కేటీఆర్ డైలాగ్ వెనుక అర్థం తెలిసిందన్న రాములమ్మ
By: Tupaki Desk | 6 Sep 2019 12:25 PM GMTఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రాములమ్మ అలియాస్ విజయశాంతి. యాదాద్రి పుణ్యక్షేత్రంలో.. ఆలయంలోని శిలలపై కేసీఆర్.. కారు.. ప్రభుత్వ పథకాలకు చెందిన బొమ్మల్ని శిలలపై చెక్కిన వైనం బయటకు రావటం.. అదో సంచలనంగా మారటం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా విజయశాంతి స్పందించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సారు..కారు.. పదహారు.. సర్కారు అంటూ రిథమిక్ నినాదాన్ని అదే పనిగా వినిపించటం వెనుక అసలు సీక్రెట్ ఏమిటో తనకు అర్థమైందన్నారు.
పవిత్రమైన యాదగిరిగుట్టలో చేపడుతున్న ఆధునీకీకరణలో భాగంగా అక్కడ నిర్మిస్తున్న స్థూపాలో దేవతామూర్తులతోపాటు కేసీఆర్ సార్ బొమ్మను.. కారు గుర్తును.. టీఆర్ఎస్ సర్కారు గుర్తును చెక్కటం ద్వారా.. కేసీఆర్ తనను తాను మహారాజుగా ఊహించుకుంటున్నారని అర్థమవుతుందన్నారు.
రాజ్యాలు.. రాజులు కనుమరుగైన తర్వాత కూడా కేసీఆర్ తన దొరతనాన్ని ప్రదర్శించాలనుకోవటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. ప్రతిపక్షాలు ఈ విషయంపై చేసే ప్రకటనల్ని కేసీఆర్ రాజకీయకోణంలో చూసి.. వాటిని పట్టించుకోకుండా ఉండే అవకాశం ఉందన్నారు.
తిరుమలతో సమానంగా తెలంగాణలో యాదగిరి గుట్టను తెలంగాణ ప్రజలు పవిత్ర క్షేత్రంగా నమ్మతారని.. అలాంటి క్షేత్రాన్ని తమ రాజకీయ ప్రచారానికి వాడుకోవటం.. ఆలయ పవిత్రతను దెబ్బ తీసేలా వ్యవహరించటం సరికాదన్నారు. ఈ తీరుపై మఠాధిపతులు.. పీఠాధిపతులు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. విజయశాంతి తీరు చూస్తుంటే.. శిలలపై సారు బొమ్మల్ని రాజకీయ నేతల కంటే కూడా.. పీఠాధిపతులు.. మఠాధిపతులు రియాక్ట్ కావాలని కోరటం కనిపించక మానదు.