Begin typing your search above and press return to search.
కేసీఆర్ కు మంట పుట్టించే ప్రకటన చేసిన రాములమ్మ
By: Tupaki Desk | 3 March 2019 2:04 PM GMTపూర్తి మెజర్టీ ఉన్నప్పటికీ - ఆపరేషన్ ఆకర్ష్ ను తెలంగాణలో అధికార టీఆర్ ఎస్ పార్టీ జోరుగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలకు గులాబీ కండువా కప్పేసిన గులాబీ పార్టీ తాజాగా మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ ఎస్ లోకి ఆకర్షించింది. భద్రాద్రిజిల్లా పినపాక ఎమ్మెల్యే రేగాకాంతారావు - ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రంసక్కు కేసీఆర్ కు జైకొట్టారు. ఇద్దరు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేస్తూ.. టీఆర్ ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఒక వైపు శనివారం రాత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పీసీసీ చీఫ్ ఉత్తమ్ సమావేశం కావాల్సిన సమయంలోనే.. ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేయడం కలకలం రేపింది.
కాగా, ఇద్దరు ఎమ్మెల్యేల జంపింగ్ పై టీపీసీసీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి ఫైరయ్యారు.పార్టీ శ్రేణులకు కీలక పిలుపునిచ్చారు. ఈవీఎంలను అడ్డం పెట్టుకుని అడ్డదారుల్లో అధికారంలోకి వచ్చిన టీఆర్ ఎస్..ఇప్పుడు ప్రజాతీర్పును సైతం అవహేళన చేస్తూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే పనిలో పడిందని విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చే రీతిలో ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో టీఆర్ ఎస్ చేస్తున్న అకృత్యాలపై ప్రతిపక్షాలు పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని విజయశాంతి అన్నారు. టీఆర్ ఎస్ తరపున గెలిచి - కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీలపై శాసన మండలి ఛైర్మన్ వెనువెంటనే వేటు వేశారని, ఇప్పుడు విపక్షాల గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారితే స్పీకర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రాములమ్మ ప్రశ్నించారు. అసెంబ్లీ స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కాంగ్రెస్ - టీడీపీలకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు కోరుకుంటున్నారని విజయశాంతి చెప్పారు. ఈ విషయంలో న్యాయం జరగకపోతే - పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు వెళ్లి వారిని అక్కడి ఓటర్ల ముందు ఎండగట్టాలని తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులకు ఆమె పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యేల చేరికల జోష్ లో ఉన్న టీఆర్ ఎస్ పార్టీకి తాజాగా విజయశాంతి ఇచ్చిన పిలుపు హీట్ పుట్టించేదేనని అంటున్నారు. ఓవైపు ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన తెలుపుతున్న ఈ పార్టీ తాజాగా క్షేత్రస్థాయిలో కూడా రోడ్డెక్కితే - ఆ హీట్ జోరుగా ఉంటుందని అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చే పిలుపుతో గులాబీ పార్టీ ఏ విధంగా వ్యవహరిస్తుందో వేచి చూడాల్సిందే.