Begin typing your search above and press return to search.

బీజేపీలో విజయశాంతి చేరిక రేపేనా?

By:  Tupaki Desk   |   28 Nov 2020 4:50 PM GMT
బీజేపీలో విజయశాంతి చేరిక రేపేనా?
X
గ్రేటర్ ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ అయితే కేంద్రమంత్రులు, సీఎంలను తెప్పించి మరో హోరెత్తిస్తోంది. ఈ ఊపులో రాములమ్మ బీజేపీలో చేరడానికి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఫైర్ బ్రాండ్ రేపే బీజేపీలో చేరబోతున్నారా? మాజీ ఎంపీ విజయశాంతి కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరబోతున్నారని తెలుస్తోంది. ఆమెతోపాటు కాంగ్రెస్ నేతలు కొందరు బీజేపీలో చేరబోతున్నట్టు సమాచారం.

విజయశాంతి ఇటీవలే ఢిల్లీ వెళలి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసినట్టు ప్రచారం సాగుతోంది. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఆమె అమిత్ షా సమక్షంలో రేపు చేరికకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.

కొంతకాలంగా విజయశాంతి కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. బీజేపీ పెద్దలు ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపారు. మూడు సార్లు కలిసి మాట్లాడారు. కేంద్రహోంమంత్రి కిషన్ రెడ్డి ఒకసారి..అంతకుముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండు సార్లు సమావేశమయ్యారు. ఆమెను బీజేపీలో చేరేలా ఒప్పించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ అయ్యాక ఆయన దూకుడు వైఖరి విజయశాంతికి బాగా నచ్చిందని.. కేసీఆర్ సర్కార్ ను బండి ఎదుర్కొంటున్న తీరుకు ఆనందంగా ఉందని.. అందుకే ఇలాంటి పార్టీలో ఉండాలని విజయశాంతి కోరుకుంటున్నట్టు తెలిసింది. మరోవైపు విజయశాంతి గొప్ప నాయకురాలని.. తెలంగాణ మిగతా ఉద్యమకారుల్లాగానే ఆమెకు కేసీఆర్ అన్యాయం చేశారని బండి సంజయ్ ఆరోపించడం విశేషంగా మారింది. ఇక దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ విజయం కూడా విజయశాంతిని ఆకర్షించిందని ఆమెను బీజేపీలో చేరేలా ప్రోత్సహించిందన్న టాక్ ఉంది.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఆదివారం గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి రానుండగా.. షా సమక్షంలో బీజేపీ తెలంగాణ కార్యాలయంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు విజయశాంతి.. గత కొంత కాలంగా విజయశాంతి చేరికపై ప్రచారం సాగుతున్నా.. కాంగ్రెస్ నేతలు కండిస్తున్నా.. ఫైనల్‌గా ఆమె బీజేపీ గూటికి చేరడం ఖాయమైపోయిందని.. రేపే అమిత్ షా సమక్షంలో చేరబోతున్నారని తెలుస్తోంది.