Begin typing your search above and press return to search.
సర్ ప్రైజ్: కాషాయ మాస్క్ తో విజయశాంతి
By: Tupaki Desk | 1 Dec 2020 1:14 PM GMTప్రముఖ నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నా ఆమె మనసు మాత్రం కమళం వైపు లాగుతున్నట్టే కనిపిస్తోందని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే బీజేపీ పెద్దలు ఆమెను కలిసి పార్టీలోకి రమ్మని ఆహ్వానించారు. కానీ విజయశాంతి ఎటూ తేల్చడం లేదు. తన తదుపరి రాజకీయ అడుగుపై స్పందించడం లేదు.
కొన్ని వారాల క్రితం విజయశాంతి ఢిల్లీ వెళ్లి బిజెపి అగ్ర నాయకులను కలుసుకున్నారన్న వార్త గుప్పుమంది. కానీ ఆమె బీజేపీలో చేరిక ప్రయత్నం మాత్రం కార్యరూపం దాల్చలేదు. అతి త్వరలో ఆమె బిజెపిలో చేరనున్నట్లు ఆమె శిబిరం మీడియాకు లీక్ ఇచ్చినప్పటికీ, అది జరగలేదు.
వాస్తవానికి అమిత్ షా ఆదివారం హైదరాబాద్ సందర్శించినప్పుడు విజయశాంతి బీజేపీలో చేరుతారని జోరుగా ప్రచారం సాగింది. కాని అది జరగలేదు. ఇంకా స్పష్టత రాలేదు. బిజెపిలో చేరడానికి ఆమె ఇంకా వెనకడుగు వేస్తున్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ విజయశాంతి మంగళవారం ఓటు వేయడానికి వచ్చినప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచారు. విజయశాంతి తన ఓటు వేయడానికి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 12 లోని పోలింగ్ కేంద్రానికి చేరుకుంది. ఓటింగ్ తరువాత, ఆమె సిరాతో గుర్తించబడిన తన చేతి వేలును కెమెరాకు చూపించి పోజు ఇచ్చింది. కానీ విజయశాంతి తాజాగా కాషాయ రంగు మాస్క్ ధరించి కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీన్ని ఆమెకు బీజేపీపై ప్రేమ చావడం లేదని అర్థమవుతోంది. ఆమె అతి త్వరలో బీజేపీలోకి చేరుతుందనే ప్రచారానికి సంకేతంగా విజయశాంతి ఇలా కనిపించింది కావచ్చు అని పలువురు అనుకుంటున్నారు.