Begin typing your search above and press return to search.
విజయశాంతి పిల్లల్ని అందుకే కనలేదట..!
By: Tupaki Desk | 4 Oct 2018 8:51 AM GMTరాజకీయ ఫైర్ బ్రాండ్ ఆమె.. అంతకుముందు సినిమా రంగంలో లేడి అమితాబ్ బచ్చన్ గా పేరొందారు. స్టార్ హీరోలతో సరిసమానంగా క్రేజ్ సంపాదించి అప్పట్లో టాలీవుడ్ ను ఏలారు. సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టాక చాలా రోజులకు రాజకీయాల్లోకి వచ్చారు విజయశాంతి. ఆ తర్వాత తెలంగాణ కోసం ఉద్యమించి గులాబీ గూటికి చేరారు. అక్కడ కేసీఆర్ తర్వాత నంబర్ 2 అనిపించుకున్నారు. కానీ కేసీఆర్ తో విభేదాలు ఆమెను పార్టీ మారేలా చేశాయి. 2014కు ముందు కాంగ్రెస్ లో చేరారు. కానీ బ్యాడ్ లక్.. అదే టీఆర్ ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. కట్ చేస్తూ మళ్లీ నాలుగున్నరేళ్ల తర్వాత ఇప్పుడు యాక్టివ్ అయ్యారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమా - రాజకీయాల్లోని పరిస్థితుల గురించి కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమా రంగంలో డబ్బు - హోదా అన్ని చూశానని.. ఆస్తులు కూడబెట్టుకోవడానికో.. పేరు ప్రఖ్యాతల కోసమో రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. ప్రజా సేవ కోసం పాలిటిక్స్ లోకి వచ్చానని క్లారిటీ ఇచ్చారు.
ఇక 2014 ఎన్నికల్లో ఓడిపోయాక ఎందుకు క్రియాశీల రాజకీయాల్లో లేరనే ప్రశ్నకు విజయశాంతి క్లారిటీ ఇచ్చారు. తనకు ఎన్నికల తర్వాత పూర్తిగా ఆరోగ్యం క్షీణించిందని.. ఓ పెద్ద ఆపరేషన్ కూడా జరిగిందని వివరించారు. దాన్నుంచి కోలుకోవడానికే రెండేళ్ల సమయం పట్టిందని.. అందుకే ఆ సమయంలో సినీ, రాజకీయాలకు దూరంగా ఉన్నానని అసలు రహస్యాన్ని విజయశాంతి చెప్పుకొచ్చారు.
ప్రజాసేవకు అంకితం కావాలనే ఉద్దేశంతోనే పిల్లలను కనలేదని విజయశాంతి పేర్కొన్నారు. సంతానం ఉంటే ఆశ పెరిగిపోతుందని.. స్వార్థం ఎక్కువైపోతుందనే కనలేదని వివరణ ఇచ్చారు. నేను నా భర్త - పిల్లలు వద్దని అనుకున్నామని.. ప్రజలనే పిల్లలుగా భావిస్తున్నానని తెలిపారు. నా మరణానంతరం ఆస్తినంతా ప్రజలకు ధారపోస్తానని వివరించింది. నా తల్లి పేరు - నా పేరున ఫౌండేషన్ పెట్టి సేవచేస్తానని వివరించారు. విలాసాలపై ఆసక్తి లేదని.. నా నగలన్నింటిని ఓ సారి మెదక్ లోని వేంకటేశ్వర స్వామి హుండీలో వేశానని వివరించింది.
ఇక సినీ నటులు రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాణించలేకపోవడానికి కారణాన్ని విజయశాంతి వెల్లడించారు. ఇప్పటి కుట్రలు - కుతంత్రాలు తట్టుకోలేక వారు రాణించలేకపోతున్నారన్నారు. సినీ నటులు చాలా సెన్సిటివ్ గా ఉంటారని అందుకే..రాజకీయాల్లో ఇమడలేకపోతున్నారని వివరించారు.