Begin typing your search above and press return to search.

సారు..కారు.. స‌ర్కారు నినాదం తేడా కొట్టేట్టుంది సారూ!

By:  Tupaki Desk   |   2 April 2019 5:19 AM GMT
సారు..కారు.. స‌ర్కారు నినాదం తేడా కొట్టేట్టుంది సారూ!
X
తెలివి ఏ ఒక్క‌రి సొత్తు ఎంత‌మాత్రం కాదు. తాజాగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ విజ‌య‌శాంతి మాట‌లు వింటే ఈ భావ‌న క‌లుగ‌క మాన‌దు. సారు..కారు.. ప‌ద‌హారు.. స‌ర్కారు అంటూ టీఆర్ ఎస్ నినాదాన్ని ఆమె కాస్త మార్చి కౌంట‌ర్ ఇచ్చిన వైనం ఆస‌క్తిక‌రంగానే కాదు.. ఎక్కువ‌సార్లు ఈ రిథ‌మిక్ నినాదాన్ని వాడ‌కుండా ఉంటే మంచిద‌న్న భావ‌న క‌లుగ జేయ‌టం ఖాయం.

టీఆర్ ఎస్ నేత‌లు ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్తున్న నినాదాన్ని విజ‌య‌శాంతి త‌న‌దైన శైలిలో కాస్త మార్చేశారు. కేసీఆర్ సారు.. ప్ర‌ధాని కారు అంటూ ఆమె ఇచ్చిన పంచ్ మామూలుగా లేద‌న్న మాట వినిపిస్తోంది. కేటీఆర్ అదే ప‌నిగా వ‌ల్లె వేస్తున్న సారు..కారు.. సర్కారు నినాదానికి త‌న‌దైన శైలిలో పంచ్ ఇచ్చిన విజ‌య‌శాంతి మాట‌ల్ని విన్న త‌ర్వాత త‌మ నినాదాన్ని మార్చుకోవాల‌న్న ఆలోచ‌న గులాబీ నేత‌ల్లో రావ‌టం ఖాయ‌మంటున్నారు.

గులాబీ పార్టీ నినాదానికి ప‌ర్ ఫెక్ట్ కౌంట‌ర్ వేసిన విజ‌య‌శాంతి.. కేసీఆర్‌.. జ‌గ‌న్ ల‌ను ఉద్దేశించి మ‌రో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ను చేశారు. టీఆర్ ఎస్ పార్టీ 16 సీట్ల‌తో కేంద్రంలో చ‌క్రం తిప్పితే.. 20-22 సీట్లు గెలుస్తాన‌న్న ధీమా వ్య‌క్తం చేస్తున్న జ‌గ‌న్ ఢిల్లీలో ఏం చేస్తార‌ని ప్ర‌శ్నించారు.

త‌క్కువ సీట్లు ఉన్న గులాబీ పార్టీ.. ఎక్కువ సీట్లు గెలిచే పార్టీని ఏ రీతిలో శాసిస్తుంద‌ని ప్ర‌శ్నించిన ఆమె.. కేసీఆర్ చ‌క్రం తిప్పే వ‌ర‌కూ జ‌గ‌న్ ఊరుకుంటారా? అని ప్ర‌శ్నించారు. త‌క్కువ సీట్లు వ‌చ్చే కేసీఆర్‌.. జ‌గ‌న్ లాంటి వారితో మ‌మ‌త‌.. మాయావ‌తి లాంటి వారు ప‌ని చేస్తారా? అన్న సందేహాన్ని వ్య‌క్తం చేశారు. మిగిలిన సంగ‌తులు ఎలా ఉన్నా.. విజ‌య‌శాంతి లేవ‌నెత్తిన పాయింట్లు మాత్రం క‌చ్చితంగా డిబేట్ చేయాల్సిన అంశాలేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.