Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్ అంటే ఏంటో తెలుసా కేటీఆర్: విజయశాంతి

By:  Tupaki Desk   |   7 Jun 2021 2:30 PM GMT
వ్యాక్సిన్ అంటే ఏంటో తెలుసా కేటీఆర్: విజయశాంతి
X
తెలంగాణ సర్కార్ పై సోషల్ మీడియాలో మాత్రమే స్పందించే రాములమ్మ ఈసారి మంత్రి కేటీఆర్ పై పడ్డారు. కేటీఆర్ పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కు వ్యాక్సిన్ అంటే ఏంటో తెలుసా? టీకా ఉత్పత్తి ఎలా జరుగుతుందో కొంతమాత్రమైనా అవగాహన ఉందా? అని ప్రశ్నించారు.

వ్యాక్సిన్ అనేది గంటలలోనో.. రోజులలోనో ఉత్పత్తి అయ్యి ఇప్పటికిప్పుడు ఇబ్బడిముబ్బడిగా తయారు చేసేది కాదని.. అదొక ప్రత్యేకమైన ప్రక్రియ అని విజయశాంతి పేర్కొన్నారు.కేంద్రప్రభుత్వానికి విజన్ లేదు.. ప్లాన్ లేదంటూ మాట్లాడుతున్న కేటీఆర్ కి సరైన విజ్ఞత లేదని అర్థమవుతోందని విజయశాంతి మండిపడ్డారు.

ప్రపంచంలోనే వ్యాక్సినేషన్ మొదలైందే గత డిసెంబర్ లోనని.. భారత్ లో జనవరి 16వ తేదీని వ్యాక్సినేషన్ ప్రారంభమైందని విజయశాంతి అన్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 25 కోట్లకు పైగా టీకా డోసులు పూర్తి చేశామని అన్నారు. ఇది అమెరికా కంటే ఎక్కువన్న సంగతి తెలుసా? కేటీఆర్ అంటూ సెటైర్లు వేశారు.

టీకా పంపిణీపై టీఆర్ఎస్ సర్కార్ దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటు అని.. కేంద్రంపై నిందలు మోపుతున్న వారికి బాధ్యత ఉందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం జీవితమే కమీషన్ల బాపతు అని ఫైర్ అయ్యారు. కేసీఆర్ సర్కార్ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై నిందలు మోపుతున్నారని విజయశాంతి నిప్పులు చెరిగారు.