Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ సోనియా కాళ్లు మొక్కారు : విజయశాంతి !

By:  Tupaki Desk   |   7 Dec 2020 12:34 PM GMT
కేసీఆర్‌ సోనియా కాళ్లు మొక్కారు : విజయశాంతి !
X
ప్రముఖ సీనియర్ సినీనటి, రాజకీయ నేత విజయశాంతి కాంగ్రస్ కి గుడ్ బై చెప్పేసి బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ సమక్షంలో విజయశాంతి తన పాత గూటికి చేరుకున్నారు. ఆమెకు పార్టీ అగ్ర నాయకుడు అరుణ్‌ సింగ్‌ బీజేపీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఆమెకు కండువా కప్పి స్వాగతం పలికారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇక ఆ తర్వాత విజయశాంతి మాట్లాడుతూ.. 1998లో బీజేపీలో చేరాను. కొందరు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారని 2005లో ఆ పార్టీ నుంచి బయటికి వచ్చాను. ఆ తర్వాత తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి అనేక సమస్యలపై పోరాటం చేశాను. అప్పుడు నా పార్టీనీ టీఆర్‌ఎస్‌లో విలీనం చేయమని అడిగారు. నిజానికి నేను 1998లోనే తెలంగాణ పోరాటం మొదలు పెట్టాను. టీఆర్‌ఎస్‌ కంటే ముందు నేను తెలంగాణ ఉద్యమంలో భాగమయ్యాను. కేసీఆర్‌ కుట్రతోనే టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అని చెప్పుకొచ్చారు.

తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు కేసీఆర్‌ పార్లమెంట్‌లో లేరు. ఆయన సోనియా గాంధీ కాళ్ళ మీద పడ్డారు. ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నారు. తెలంగాణలో తన కుటుంబం మాత్రమే ఎదగాలనే స్వార్థం కేసీఆర్‌ది. కాంగ్రెస్‌ పార్టీ అసలు సమస్యలపై పోరాటం చేయడం లేదు. కాంగ్రెస్‌ కు ఆయన స్లో పాయిజన్ ఎక్కించారు. కాంగ్రెస్ పోరాడలేని స్థితికి చేరుకుంది. ఏడాది కిందటే బీజేపీలో చేరాలని అనుకున్నా.కేసీఆర్‌ ను గద్దె దించడమే నా లక్ష్యం.పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తా. తెలంగాణ ప్రజలు బాగు పడడమే నాకు కావాలి. టీఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీ మాత్రమే అని విజయశాంతి అన్నారు.