Begin typing your search above and press return to search.
షర్మిలకు అండగా ఫైర్ బ్రాండ్ వ్యాఖ్యలు!
By: Tupaki Desk | 16 Jan 2019 6:16 AM GMTసోషల్ మీడియాను వేదికగా చేసుకుంటూ విష ప్రచారాలు సాగిస్తున్న కొందరి కారణంగా పలువురు తీవ్ర అసౌకర్యానికి.. మనశ్శాంతి కరువై ఇబ్బంది పడుతున్నారు. రాయలేని భాషతో దుర్మార్గానికి పాల్పడుతున్నారు. ఇలాంటి తీరుపై నోరు విప్పితే ఇబ్బందులు మరింత ఎక్కువ అవుతాయన్న అనుమానంతో లోలోనే బాధ పడే పరిస్థితి.
మహిళా సెలబ్రిటీలకు తరచూ ఎదురవుతున్న ఈ వైఖరిపై ఆగ్రహాన్ని.. ఆవేదనను వ్యక్తం చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సోదరి షర్మిల ఇటీవల హైదరాబాద్ సీపీకి ఫిర్యాదు చేయటం తెలిసిందే. సోషల్ మీడియాలో తనపై అడ్డగోలు రాతలు రాస్తున్న వారి తీరును ఆమె ప్రశ్నించారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ మహిళా నేత.. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న రాములమ్మ అలియాస్ విజయశాంతి అండగా నిలిచారు. షర్మిలపై సోషల్ మీడియాలో సాగిస్తున్న అసత్య ప్రచారంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమాజంలో మహిళా సెలబ్రిటీలపై విషం కక్కే ఈ విష సంస్కృతిని వెనువెంటనే నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాల్లో మహిళల్ని అణగదొక్కేస్తున్న ఈ రోజుల్లో.. వారి సాధికారిత కోసం పోరాడిన వ్యక్తిగా తనకు ఈ తరహా అంశాలపై స్పష్టమైన అవగాహన ఉందన్న ఆమె.. 40 ఏళ్లుగా హహిళా సాధికారిత కోసం అటు సినిమాల్లోనూ.. ఇటు రాజకీయాల్లోనూ పోరాడిన వ్యక్తిగా తనకు పూర్తి అవగాహన ఉందన్నారు.
మహిళా ప్రముఖులపై సోషల్ మీడియాలో విషం కక్కే ఇలాంటి దుర్మార్గాల కారణంగా మానసికంగా కుంగదీస్తాయన్నారు. దుష్ప్రచారం సాగించే వారిని అదుపులోకి తీసుకొని వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని.. దీనికి తగ్గట్లు హైదరాబాద్ పోలీసులు స్పందించాలని రాములమ్మ డిమాండ్ చేస్తున్నారు.