Begin typing your search above and press return to search.
మెగా బ్రదర్ కు పంచ్ ఇచ్చేలా రాములమ్మ తాజా పోస్టు
By: Tupaki Desk | 20 May 2020 5:00 AM GMTకెలుక్కొని వివాదాల్లోకి కూరుకుపోవటం కొందరికి అలవాటు. తాను ఆ కోవకు చెందిన వ్యక్తినన్న విషయాన్ని మెగా బ్రదర్ నాగబాబు అందరికి తెలిసేలా చేయాలనుకుంటున్నారా? కొన్ని విషయాలు చర్చ కన్నా కూడా అప్పటికే తమకున్న అభిప్రాయం నుంచి బయటకు రాకుండా మాట్లాడేసే ధోరణి కనిపిస్తుంటుంది. సెంటిమెంట్ ను రాజేసే అంశాల్ని తొందరపడి కెలుక్కోవటానికి మించిన తప్పు మరొకటి ఉండదు. అలాంటి వాటితో జరిగే డ్యామేజ్ ను ఎంతగా ప్రయత్నించినా తగ్గించే అవకాశం ఉండదు.
జాతిపిత గాంధీ మహాత్ముడ్ని చంపిన గాడ్సే ను ఉద్దేశించి నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇప్పటికే తమ మీద పడిన మరకల్ని సరైన రీతిలో సమాధానం చెప్పలేక కిందా మీదా పడే మెగా ఫ్యామిలీ.. గాడ్సే లాంటి వారి మీద చర్చ అవసరం లాంటి అంశాల్ని కెలుక్కోవాల్సిన అవసరం లేదు. నాగబాబు చేసిన ట్వీట్ సంచలనం గా మారిన వేళ.. తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రాములమ్మ అలియాస్ విజయశాంతి స్పందించారు.
‘ఈశ్వర్, అల్లా... తేరానామ్... సబ్ కో సన్మతి దే భగవాన్.. ''నాకు కూడా''...''అని'' గాడ్సే, ఇప్పుడు బ్రతికుంటే... ఈ జన్మదినం నాడు ఇదే ప్రార్ధించేవాడు, మహాత్మా మన్నించండి’ అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు. ఎక్కడా నాగబాబు ప్రస్తావన తీసుకురాకున్నా.. తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేస్తూ.. మెగా బ్రదర్ కు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. మరీ పోస్టుకు నాగబాబు రియాక్షన్ ఎలా ఉంటుందో?