Begin typing your search above and press return to search.
బీసీ గర్జనలో ఏం చెబుతారు... ఈ విమర్శలకు జగన్ ఆన్సర్ ఇస్తారా...!
By: Tupaki Desk | 6 Dec 2022 1:30 PM GMTవిజయవాడ వేదికగా.. బుధవారం వైసీపీ నేతలు బీసీ గర్జన సభను నిర్వహించనున్నారు. ఈ వేదిక ద్వారా బీసీలకు తమ వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది? అనే విషయాలను వారు ఈ సందర్భంగా వివరించే ప్రయత్నం చేయనున్నారు. అదే సమయంలో బీసీలు వైసీపీకి ఎందుకు అండగా ఉండాలో కూడా వివరించనున్నారు. కీలకమైన బీసీ నేతలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
ఈ నేపథ్యంలో బీసీ గర్జన సభపై అనేక అంచనాలువచ్చాయి. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ నేతలు కూడా.. ఈ సభపై దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి వైసీపీ అనేక వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టింది. అదే సమ యంలో ప్రాంతాల వారీగా కూడా .. ప్రజలను తనవైపు తిప్పుకొనే ప్రయత్నాలను కూడా ముమ్మరం చేసింది.
ఇక, మరోవైపు.. సామాజిక వర్గాల వారీగా కూడా వైసీపీ దూకుడు పెంచింది. ఈ క్రమంలో తొలి ప్రయత్నం గా బీసీ గర్జన పేరుతో విజయవాడలో భారీ సభ పెట్టనుంది. సీఎం జగన్ తన కేబినెట్‌లో బీసీలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చారు.
అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో నూ వారికి ప్రాధాన్యం ఇచ్చారు. ఇక, బీసీ కార్పొరేషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మహిళలకు ఎక్కువగా అవకాశం కల్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బీసీలు అందరూ కూడా తమకు అండగా నిలవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భం గా చెప్పదల్చుకున్న ప్రధాన అంశంగా పరిగణిస్తున్నారు. అయితే, అదే సమయంలో బీసీలకు సంబంధించిన కార్పొరేషన్ నామమాత్రంగా మారిపోవడం గమనార్హం. అదేవిధంగా బీసీలకు మంత్రిపదవులు ఇచ్చినా.. వారికిఅధికారాలు ఇవ్వలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
పేరుకు లెక్కకు మిక్కిలిగా బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా నిధులు లేవు. ఆ కార్పోరేషన్లలో డైరెక్టర్లకు జీతాలు కూడా లేని పరిస్థితి. ఇప్పుడు ఇవే విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఆరోపణలను తిప్పికొడుతూ.. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా బీసీలను తనవైపు తిప్పుకొనే ప్రయత్నాలకు వైసీపీ ప్రయత్నిస్తోంది. మరి ఈ సభ ఎలా సాగుతుందో .. ఏం చెబుతారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.