Begin typing your search above and press return to search.

ట్విట్ట‌ర్ సీఈవోగా విజ‌య‌వాడ అమ్మాయి!?

By:  Tupaki Desk   |   4 Sep 2015 5:56 AM GMT
ట్విట్ట‌ర్ సీఈవోగా విజ‌య‌వాడ అమ్మాయి!?
X
నిజంగా ప్ర‌తి తెలుగువాడు గ‌ర్వంగా త‌లెత్తుకోవ‌చ్చు. మైక్రో సాఫ్ట్ సీఈవో గా అనంత‌పురం జిల్లాకు చెందిన స‌త్య నాదెళ్ల ఎంపిక‌య్యి ఓ సంచ‌ల‌నం సృష్టించారు. ప్ర‌పంచం లోనే ఎంతో పేరున్న ఈ సంస్థ‌కు ఒక తెలుగు వ్య‌క్తి సీఈవో గా ఎంపిక‌వ్వ‌డం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. ఇప్పుడు మ‌రో షాకింగ్ న్యూస్ ఏంటంటే సోష‌ల్ మీడియాలో కీల‌క‌మైన ట్వీట్ట‌ర్ సీఈవో గా ఏపీలోని విజ‌య‌వాడ‌కు చెందిన ప‌ద్మ‌శ్రీ వారియ‌ర్ పేరు ప‌రిశీల‌న‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

ప‌ద్మ‌శ్రీ వారియ‌ర్ గ‌త 20 సంవ‌త్స‌రాలుగా అమెరికా లో స్థిర‌ప‌డ్డారు. ఇప్పటి దాకా ట్విట్టర్ సీఈవోగా ఉన్న డిక్‌కాస్టలో రాజీనామా చేయడంతో ఈ అత్యున్నత పదవి కోసం ఆ సంస్థ ఆరుగురు పేర్లను పరిశీలించింది. పద్మశ్రీ తో పాటు సీవీఎస్ ఇంట్రాక్టివ్ విభాగం అధినేత జిమ్‌లాన్‌జోన్‌,

మ‌రో వ్య‌క్తి స్టెన్సార్ స్టూవ‌ర్ట్‌ మ‌ధ్యే ప్ర‌ధాన పోటీ ఉన్న‌ట్టు తెలుస్తోంది. వీరిలో ఎవరికి సీఈవో పదవి లభిస్తుందనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. అయితే కన్సూమర్ ఇంటర్‌నెట్ వ్యాపారంలో ఆరితేరిన పద్మశ్రీ వారియర్ వైపే ట్విట్టర్ యాజమాన్యం మొగ్గు చూపినట్లు సమాచారం. దీని పై ఈ రోజు ట్వీట్ట‌ర్ యాజ‌మాన్యం తుది నిర్ణ‌యం తీసుకోనుంది.

ప‌ద్మ‌శ్రీ ట్వీట్ట‌ర్ సీఈవో రేసులో ఉన్నార‌న్న వార్త‌ తో విజ‌య‌వాడ‌ లో ఆమె స‌న్నిహితులు, బంధువులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఈమెతో సంబంధం ఉన్న మాంటిస్సోరీ, స్టెల్లా కాలేజ్ సిబ్బంది ప‌ద్మ‌శ్రీ సీఈవో గా ఎంపిక‌వ్వాలంటూ కోరుకుంటున్నారు. పద్మశ్రీ వారియర్ స్వస్థలం విజయవాడ. మాంటిసోరిస్ స్కూల్‌ లో పదో తరగతి వరకు చదివిన పద్మశ్రీ స్టెల్లా కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. పద్మశ్రీ గత 20 ఏళ్లుగా అమెరికాలో స్థిర పడి పలు కంపెనీల్లో కీలక పదవులు నిర్వహించారు. గతంలో సిస్కో కంపెనీకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ గా పనిచేశారు.