Begin typing your search above and press return to search.
విమానంలో టీడీపీ కార్పొరేటర్ చిల్లర చేష్ట
By: Tupaki Desk | 14 May 2016 5:10 AM GMTనలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన నాయకులు అందుకు భిన్నంగా చిల్లర చేష్టలకు పాల్పడటం ఏ మాత్రం బాగోదు. తాజాగా అలాంటి దరిద్రపు పనికి పాల్పడ్డారంటూ విజయవాడకు చెందిన తెలుగుదేశం కార్పొరేటర్ మీద ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ నుంచి హైదరాబాద్ మీదుగా గన్నవరం వెళుతున్న ఎయిరిండియా విమానంలో ప్రయాణిస్తున్న కార్పొరేటర్ తోటి ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా వ్యవహరించినట్లుగా చెబుతున్నారు.
తన పట్ల అనుచితంగా వ్యవహరించిన చంటి మీద బాధిత మహిళ ఎయిరిండియా సిబ్బందికి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని చెబుతున్నారు. విమానం దిగిన తర్వాత శంషాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బాధిత మహిళ మీద ఫిర్యాదు చేయటంతో వారు గన్నవరం పోలీసులకు సమాచారం అందించి అదుపులోకి తీసుకోవాలని చెప్పినట్లు తెలుస్తోంది.
దీంతో స్పందించిన గన్నవరం పోలీసులు చంటిని అదుపులోకి తీసుకున్నారని చెబుతున్నారు. అయితే.. కార్పొరేటర్ కి వత్తాసుగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ ఒకరు పోలీసులకు ఫోన్ చేయటంతో కార్పొరేటర్ ను వదిలేసినట్లుగా తెలుస్తోంది. ఏపీ అధికారపార్టీకి చెందిన కార్పొరేటర్ కావటంతో ఇప్పుడీ అంశం రాజకీయంగా మారింది. ఎంత రాజకీయ నాయకుడైనా సరే.. తప్పు చేసి ఉంటే మాత్రం చట్టం తన పని తాను చేసుకుంటూ పోవాల్సిందే.