Begin typing your search above and press return to search.

ఈ పండుగాడు పోకిరీనే..బెజ‌వాడ్ గ్యాంగ్ గొడ‌వ‌లో కొత్త కోణం

By:  Tupaki Desk   |   3 Jun 2020 10:30 AM GMT
ఈ పండుగాడు పోకిరీనే..బెజ‌వాడ్ గ్యాంగ్ గొడ‌వ‌లో కొత్త కోణం
X
విజ‌య‌వాడ‌లో గ్యాంగ్ స్టార్ గొడ‌వ‌తో ప్ర‌స్తుతం అక్కడ ప‌రిస్థితులు ఆందోళ‌న‌క‌రంగా మారాయి. ఈ గొడ‌వ‌లో పాల్గొన్న పండు నిజంగా పోకిరీనే. అత‌డిదంతా నేర చ‌రిత్రే ఉంది. స్వ‌భావం కూడా అలాంటిదే. విజ‌య‌వాడ సనత్‌నగర్‌లోని రామాలయం వీధిలో పండు తల్లి పద్మ, ఆమె బంధువులు కలిసి ఐదు కుటుంబాలు నివసిస్తున్నాయి. కొన్నేళ్ల నుంచి అడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. ఈ క్ర‌మంలో స్థానికుల మ‌ధ్య గొడ‌వ‌లు.. కేసులు పెట్టడం వంటివి జ‌రుగుతూనే ఉన్నాయి. పోలీసుస్టేషన్ల చుట్టూ తిరగడం వీరికి అలవాటు.

విజ‌య‌వాడ‌లో కాల్‌మనీ వ్యాపారం జరుగుతున్న రోజుల్లో పండు తల్లి రూ. 15 చొప్పున‌ వడ్డీతో అప్పులు ఇచ్చి వసూళ్లు చేసేదని స్థానికులు చెబుతున్నారు. ఎవరైనా ఇవ్వకపోతే దాడులు చేసి మరీ వసూలు చేసేదని కూడా తెలుస్తోంది. తన కొడుకు ఎక్కడైనా గొడవపడితే తల్లి వెనకేసుకొచ్చేదని సమాచారం.

- 2012లో పెనమలూరు పోలీసుస్టేషన్‌ పరిధిలో కొట్లాట కేసులో పండుపై కేసు నమోదైంది.
- 2017లో పటమట పోలీసుస్టేషన్‌ పరిధిలో మరో కొట్లాట కేసు నమోదు.
- 2019లో కృష్ణలంకలో కేసు నమోదైంది.

ఈ మూడు కేసుల విష‌యంతో తల్లి పద్మ కుమారుడు పండును వెన‌కేసుకొచ్చింది. అన్ని దగ్గరుండి చూసుకున్నదని పండు స్నేహితులు చెబుతున్నారు. తల్లి అండతో పండులో రెచ్చ‌చిపోయి గ్యాంగ్‌స్టార్‌గా మారిపోయాడు. నిత్యం తన చుట్టూ పది మంది స్నేహితులు, బ్లేడ్‌బ్యాచ్‌ సభ్యులతో హంగామా సృష్టించేవాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. పండు అతడి స్నేహితులు వీధిలోకి వస్తే ఎవరూ బయటకొచ్చేవారు కాదని, పండు కుటుంబసభ్యులు ఉంటోన్న ఇళ్లవైపునకు వెళ్లే ధైర్యం కూడా చేసేవారు కాదు. పండు, అత‌డి స్నేహితులు ఎప్పుడూ గంజాయి, మద్యం మత్తులోనే ఉండేవారు.

డొంకరోడ్డులో జరిగిన గ్యాంగ్‌వార్‌పై పోలీసు కమిషనర్‌ తీవ్రంగా పరిగణించడంతో నిందితుల వేటలో పోలీసులు ఉన్నారు. సందీప్‌ మృతితో నిందితులు అందరిపై ఐపీసీ 302, 307, 188, 269 సెక్షన్లతో కోవిడ్‌–19 చట్ట ప్రకారం కేసులు నమోదు చేశారు. 6 బృందాలుగా విడిపోయి నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే డొంకరోడ్డులో పండు గ్యాంగ్‌ సాగించిన కార్యకలాపాలపై వివ‌రాలు సేక‌రిస్తున్నారు. ఈ గొడ‌వ‌లో ఇప్పటికే 21 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మ‌రికొన్ని రోజుల్లో అంద‌రినీ అదుపులోకి తీసుకునే అవ‌కాశం ఉంది. ఈ స‌మ‌యంలో స్థానికంగా ఉద్రిక్త వాతావ‌ర‌ణం చోటుచేసుకోకుండా పోలీసులు ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.