Begin typing your search above and press return to search.
గ్యాంగ్ వార్ లో విస్తుపోయే విషయాలు: నేతల అండదండలతోనే రచ్చరచ్చ
By: Tupaki Desk | 5 Jun 2020 10:50 AM GMTకత్తులతో దాడులు.. పిడిగుద్దుల వర్షం.. ఒకరిపై ఒకరు కొట్టుకుంటూ బీభత్సం సృష్టించిన సంఘటన బెజవాడలో జరిగిన గ్యాంగ్ వార్. రెండు గ్రూపులు కలిసి ముష్టి యుద్ధానికి దిగిన ఈ ఘటనతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా.. మరికొంత మంది ఆస్పత్రుల్లో ఉన్నారు. ఇంకా మిగతా వారంతా కటకటాల పాలయ్యారు. ఈ ఘటన జరిగి నాలుగు రోజులు గడుస్తున్నా ఇంకా స్థానికుల్లో భయాందోళన పోలేదు. దీనిపై విచారణ చేస్తున్న పోలీసులకు రోజుకో విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. ఈ గ్యాంగ్‌వార్‌లో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు ఆశ్చర్యపోతున్న పరిస్థితి. ఈ సంఘటనపై ఇప్పటికే 25 మంది స్ట్రీట్ ఫైటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 14మందిపై కేసులు నమోదు చేశారు.
ఈ గ్యాంగ్ వార్ లో పాల్గొన్న వారికి రాజకీయ నాయకుల అండదండలు ఉన్నట్లు తెలుస్తోంది. వారి ప్రోత్సాహంతోనే ఈ గ్యాంగ్‌లు స్థానికంగా హల్‌చల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పండు గ్యాంగ్ లో గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన యువకులు కూడా ఉన్నట్లు తెలిసింది. వీరిలో పాత నేరస్తుల ఉన్నట్టు సమాచారం. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. గ్యాంగ్‌వార్ లో కీలకంగా ఉన్న సందీప్, పండులకు రాజకీయ నేతల అండదండలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక యువ నాయకుడికి వీరు అనుచరులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నారు.
రెండు గ్యాంగుల్లోని 45 మందిని అదుపులోకి తీసుకొని పోలీసులు రహాస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఈ సందర్భంగా విచారణలతో తెలుస్తున్న విషయాలతో పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. ఈ గ్యాంగ్‌లోని వ్యక్తులపై అనేక నేరపూరిత చర్యలకు పాల్పడ్డారు. ఈ సందర్భంగా వారి ఫోన్ కాల్ లిస్టు ఆధారంగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. రియల్ ఎస్టేట్ సెటిల్‌మెంట్లు, వ్యక్తిగత వైరం, ఆధిపత్య పోరు ఈ గ్యాంగ్‌వార్‌కు కారణమని పోలీసులు భావిస్తుండగా మృతుడు సందీప్ భార్య తేజస్విని చేసిన ఆరోపణలతో పోలీసులు ఊహించని ట్విస్ట్ ఎదుర్కొన్నారు. తన భర్త హత్య వెనుక రాజకీయ నాయకులు ఉన్నారని చెప్పడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ దిశ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మృతుడు సందీప్‌పై గతంలోనే మూడు కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల్లో నేరం రుజువు కాకపోవడంతో కోర్టు కేసులను కోట్టేయడంతో 2015లో సందీప్‌పై ఉన్న రౌడీషీట్‌ను ఎత్తివేశారు. ఘర్షణ జరిగిన ప్రాంతం, పరిసరాల్లో సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. సందీప్, పండు ఫోన్ కాల్ రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు. ఈ గొడవతో సంబంధాలున్న వారిని అదుపులోకి తీసుకుంటూనే, మరో వైపు కొత్త గ్యాంగ్ లు పుట్టుకు రాకుండా, కార్యకలాపాలు జరగకుండా పోలీసులు నిఘా పెట్టారు. గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ఈ సందర్భంగా రౌడీ షీటర్లు, మాజీల కదలికలపై ప్రత్యేక బృందాలు నిఘా పెట్టాయి. గ్యాంగ్‌వార్‌లో బ్లేడ్ బ్యాచ్ ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే విజయవాడ వన్ టౌన్, చిట్టినగర్, సీతానగరం ప్రాంతాల్లోని కొంతమంది బ్లేడ్ బ్యాచ్ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఇకపై స్థానికంగా గ్యాంగ్ లు ఉన్న వారిపై నిఘా ఉంచేలా బెజవాడ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.