Begin typing your search above and press return to search.

ఆంధ్రా అమ్మాయితో అమెరికా అబ్బాయి పెళ్లి

By:  Tupaki Desk   |   10 Oct 2019 7:51 AM GMT
ఆంధ్రా అమ్మాయితో అమెరికా అబ్బాయి పెళ్లి
X
దాదాపు 32 ఏళ్ల క్రితం.. పడమటి సంధ్యారాగం అనే సినిమా వచ్చింది. అప్పట్లో ఆ సినిమా ఒక పెద్ద సంచలన. సనాతన సంప్రదాయానికి చెందిన ఒక తెలుగమ్మాయి.. ఒక అమెరికా కుర్రాడ్ని ప్రేమించి పెళ్లి చేసుకోవటం. ప్రఖ్యాత దర్శకుడు జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఆ చిత్రంలో సంధ్యగా నటించింది విజయశాంతి.

కట్ చేస్తే.. తాజాగా ఆంధ్రాకు చెందిన మరో సంధ్య ఈసారి అమెరికా కుర్రాడ్ని ప్రేమించి.. ఘనంగా పెళ్లి చేసుకున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ సినిమాలో కథానాయకి పేరు మాదిరే ఈ బెజవాడ అమ్మాయి పేరు కూడా సంధ్యే కావటం విశేషం.

విజయవాడ రూరల్ మండలం గూడవల్లికి చెందిన సత్యహరినాథరెడ్డి..జ్యోతి దంపతుల కుమార్తె నాగ సంధ్య. అమెరికాలోని ఫ్లోరిడా వర్సిటీలో పీహెచ్ డీ చేసింది. ప్రస్తుతం ఒరెగాన్ లోని ఇంటెల్ కార్పొరేషన్ లో టెక్నాలజీ డెవలప్ మెంట్ ఇంజనీర్ గా పని చేస్తోంది. ఆమె ఉన్న ప్రాంతానికి చెందిన ఆడం బ్యాంగ్ తో ఆమెకు ఏర్పడిన పరిచయం.. ప్రేమగా మారి పెళ్లి వరకూ వచ్చింది.

వీరి ప్రేమను అర్థం చేసుకున్న ఇరువర్గాల తల్లిదండ్రులు వీరి పెళ్లికి ఓకే అనటంతో.. తాజాగా బెజవాడలోని ఒక కల్యాణ మండపంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. తరచూ ప్రాశ్చాత్య దేశాల యువతులు మన అబ్బాయిల్ని పెళ్లాడటం చూస్తుంటాం. రోటీన్ కు కాస్త భిన్నంగా మనమ్మాయి.. అమెరికా అబ్బాయిని పెళ్లాడిన వైనం నాటి పడమటి సంధ్యారాగాన్ని గుర్తు చేసింది ఇప్పటి సంధ్య. ఆమె సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.