Begin typing your search above and press return to search.
విజయవాడలో హోటళ్లు అప్పుడే ఫుల్
By: Tupaki Desk | 21 May 2016 6:42 AM GMTమరో రెండున్నర నెలల్లో జరగాల్సిన కృష్ణానది పుష్కరాల కోసం భక్తులు ముందే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. విజయవాడ - గుంటూరు ప్రాంతాలకు వెళ్లి పుణ్యస్నానాలు చేయాలనుకుంటున్నవారంతా ఇప్పటి నుంచే అక్కడ హోటళ్లు బుక్ చేసుకుంటున్నారు. దీంతో చాలావరకు హోటళ్లలో గదులన్నీ ఇప్పటికే నిండిపోయాయని తెలుస్తోంది. కృష్ణా పుష్కరాలు ఆగస్టు 12 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం వైపు నుంచి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రజలు కూడా తమ ఏర్పాట్లు తాము చేసుకుంటున్నారు. ముఖ్యంగా అక్కడ ఉండడం కోసం హోటళ్లు బుక్ చేసుకుంటున్నారు. దీంతో పుష్కరాలకు వెళ్లాలనుకున్న భక్తులు లేటుగా స్పందించి హోటళ్లలో వసతులు పొందాలనుకుంటే మాత్రం చిక్కుల్లో పడ్డట్లే.
కాగా 12 రోజుల పాటు జరగనున్న కృష్ణా పుష్కరాల కోసం అక్కడి ప్రధాన హోటల్లలో 50వరకు గదులను ఉన్నతాధికారులకే కేటాయించనున్నారట. దీంతో సాధారణ ప్రజలకు గదుల లభ్యత కొంతవరకు తగ్గుతోంది. అయితే గదుల లభ్యత పెంచడానికి అధికారులు ఓ ఆలోచన చేస్తున్నారు. హోటళ్లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతే రూమ్ బుక్ చేసుకున్న సమయం దగ్గర్నుంచి 12 గంటల సమయంలోపు రూమ్ ను ఖాళీ చేసేలా నిబంధన పెట్టనున్నట్లు తెలుస్తోంది. అలా చేస్తే మరింత మందికి ఉండడానికి గదులు దొరుకుతాయి.
కాగా పుష్కరాల నేపథ్యంలో విజయవాడ - గుంటూరు పరిసర ప్రాంతాల్లోని హోటళ్లు - లాడ్జీల రూంల రేట్లు కూడా భారీగా పెంచేశారట. మామూలు రోజుల్లో 1500 - 2000కి దొరికే గదులకు పుష్కరాల సమయంలో 3 వేల నుంచి 6 వేల ధర చెబుతున్నట్లుగా తెలుస్తోంది. కాబట్టి గదుల లభ్యత పెంచడంతో పాటు భక్తుల జేబులు ఖాళీ కాకుండా ధరల నియంత్రణపైనా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.