Begin typing your search above and press return to search.
ప్రకాశం బ్యారేజీ నుంచి సీ ప్లేన్ ... కేంద్రం మరో కీలక నిర్ణయం !
By: Tupaki Desk | 2 Nov 2020 1:50 PM GMTప్రకాశం బ్యారేజ్‌పై సీ ప్లేన్ కి కేంద్రం ప్రతిపాదిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ లోని కేవడియా నుంచి అహ్మదాబాద్ కు ఈ సేవలని ప్రారంభించిన విషయం తెలిసిందే. సీ ప్లేన్ సర్వీసు విజయవంతం కావడంతో ఇలాంటి ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్తగా 14 వాటర్ ఏరోడ్రోమ్‌లు నిర్మించాలని భావిస్తోంది. లక్షద్వీప్, అండమాన్-నికోబార్, అసోం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ లలోనూ వివిధ మార్గాల్లో నీళ్లపై విమానాలు దిగేందుకు కావాల్సిన ఏర్పాట్లను చేసేందుకు సిద్ధమవుతున్నారు. వాటర్ ఏరోడ్రోమ్ అంటే ప్రయాణికులు సీ ప్లేన్ ఎక్కడానికి, దిగడానికి అనువుగా నదిలో నిర్మించే కాంక్రీట్ కట్టడం. ఇది నీటి పై ఎయిర్ పోర్టులా ఉంటుంది.
రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ (ఆర్ సీఎస్)–ఉడాన్ పథకంలో కొత్త ఏరోడ్రోమ్ లు నిర్మించాలని ఆలోచిస్తుంది. సీ ప్లేన్ సేవలపై హైడ్రోగ్రాఫిక్ సర్వే చేపట్టాలని ఇన్ లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యూఏఐ)ను ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ), పౌర విమానయాన శాఖ కోరాయి. నదుల్లో కాంక్రీట్ జెట్టీల(వాటర్ ఏరోడ్రోమ్) నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేసినట్లు నౌకాయాన శాఖ వర్గాలు తెలిపాయి. విజయవాడ ప్రకాశం బ్యారేజీ సీ ప్లేన్ సేవలకు అనువైన ప్రాంతంగా గుర్తించినట్లు తెలుస్తోంది. గుజరాత్ లో నర్మదా నదిలో, సబర్మతి రివర్ ఫ్రంట్ లో ఏరోడ్రోమ్ ల నిర్మాణాన్ని ఐడబ్ల్యూఏఐ రికార్డు స్థాయిలో తక్కువ సమయంలోనే పూర్తి చేసింది. ఐక్యతా శిల్పం నుంచి సబర్మతి రివర్ ఫ్రంట్ 200 కిలోమీటర్ల దూరంలో ఉంది.