Begin typing your search above and press return to search.

తమిళనాట కమలనాథుల సీఎంగా కెప్టెన్..?

By:  Tupaki Desk   |   21 Dec 2015 6:00 AM GMT
తమిళనాట కమలనాథుల సీఎంగా కెప్టెన్..?
X
మరికొన్ని నెలల్లో జరిగే తమిళనాడు ఎన్నికలకు సంబంధించి బీజేపీ గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టింది. జాతీయ పార్టీలకు ఒక పట్టాన కొరుకుడుపడని తమిళ రాజకీయాల నేపథ్యంలో.. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాట కమలవికాసం జరగాలని బీజేపీ పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా డీఎండీకే అధినేత విజయకాంత్ ను తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిందుకు డిసైడ్ అయ్యింది.

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేతో జతకట్టిన డీఎండీకే అధినేత విజయకాంత్ ఆశించినంత విజయాన్ని సాధించలేదు. దీనికి తోడు.. కమలనాథుల వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్న ఆయన.. బీజేపీతో అంటిముట్టనట్లు ఉంటున్నారు. అయితే.. తమిళనాట సొంతంగా బలం పెంచుకోవటం సాధ్యం కాని నేపథ్యంలో.. కలిసి వచ్చే మిత్రుడితో ఎన్నికల బరిలో దిగటం మంచిదన్న ఆలోచనకు వచ్చినట్లుగా చెబుతున్నారు.

ఇందులో భాగంగా బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయకాంత్ ను ప్రకటించేందుకు తమిళనాడు కమలనాథులకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చినట్లు తెలుస్తుంది. ముందస్తుగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించటం ద్వారా కలిగే లబ్థిని పొందాలని బీజేపీ.. డీఎండీకే లు భావిస్తున్నాయి. మరి.. వీరి ఆలోచనలకు తమిళులు ఎంతమాత్రం కనెక్ట్ అవుతారో చూడాలి.