Begin typing your search above and press return to search.
‘కెప్టెన్’ కు ఎదురు తిరుగుతున్న తమిళ టీం
By: Tupaki Desk | 18 Jun 2016 9:53 AM GMT అధికారంలో లేకపోతే మహామహా పార్టీలకే ముప్పతిప్పలు ఎదురవుతుంటాయి. అయిదేళ్లు అధికారంలో లేకపోతే అంతకుముందు ఎన్నిసార్లు అధికారంలో ఉన్న పార్టీల నేతలైనా కూడా అధికార పార్టీవైపు చూస్తుంటారు. అలాంటిది పార్టీ పెట్టి పదుల సంవత్సరాలు దాటుతున్నా ఒక్కసారి కూడా అధికారం అందకపోగా పార్టీ పరిస్థితి పూర్తిగా క్షీణిస్తే అందులో ఉండే నేతల ఆలోచనలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. తమిళనాడులో డీఎండీకే అధినేత విజయకాంత్ కు కూడా అలాంటి పరిస్థితే ఎదురవుతోంది. ఆ పార్టీలో ఉన్న నేతలు ఎన్నికలకు ముందే ఎదురుతిరగ్గా ఇప్పుడు ఎన్నికల్లో అధినేత సహా ఒక్కరు కూడా ఒక్క స్థానంలోనూ గెలవకపోవడంతో నేతలంతా నీరసించిపోయారు. అందుకే... అధినేతకు షాక్ ల మీద షాకులిస్తున్నారు. తాజాగా విజయకాంత్ పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహిస్తుండగా వారు చెబుతున్నమాటలు.. ఇస్తున్న షాక్ లకు ఆయనకు బుర్ర గిర్రున తిరుగుతోందట. కెప్టెన్ పార్టీలోని పలువురు నేతలు రివర్స్ గేర్ లో పయనిస్తున్నారట... ఇన్నాళ్లు కెప్టెన్ మాటే వేదమన్నవారు కూడా ఇంకెన్నాళ్లు ఖర్చు పెట్టాలని, ఇక పెట్టబోమని స్పష్టం చేస్తున్నట్టు సమాచారం. డీఎంకే - అన్నాడీఎంకేలను ఎదుర్కోవాలంటే, ఇక బీజేపీ ఒక్కటే దిక్కు అని మరి కొందరు సలహాలు ఇస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
మొన్నటి ఎన్నికల్లో కింగ్ మేకర్ అవుతానని ఆశపడిన విజయకాంత్ అలా కాకపోగా పూర్తిగా దెబ్బతిన్నారు. ఆరుగురు అంటూ ప్రజా సంక్షేమ కూటమితో ఎన్నికల్ని ఎదుర్కొని ఉన్న పరువును - బలాన్ని పోగొట్టుకుని తీవ్రకష్టాలను కొని తెచ్చుకున్నారు. పార్టీ ముఖ్య నాయకులు పలువురు ఎన్నికల సమయంలో హ్యాండిచ్చినా - ఎన్నికల అనంతరం ఇంకా డీఎండీకేలో కొనసాగాలా? అని ఆలోచించే వారి సంఖ్య పెరిగింది. అప్రమత్తమైన విజయకాంత్ ఉన్న క్యాడర్ ను రక్షించుకునేందుకు తగ్గ కుస్తీలు పట్టే పనిలో పడ్డారు. ఆగస్టులో తన జన్మదినం వస్తుండడంతో - రాష్ట్ర పర్యటన సాగించి బలోపేతం చేద్దామనుకున్న ఆయనకు పార్టీ వర్గాలు షాకులు ఇచ్చే పనిలో పడ్డారు. రెండు మూడు రోజులుగా జిల్లాల వారీగా విజయకాంత్ పార్టీ వర్గాలతో సమీక్షలో మునిగి ఉన్న విషయం తెలిసిందే. ఈ సమీక్షల్లో పార్టీ నేతలు విజయకాంత్ కు తెగ సలహాలిస్తున్నారట. బీజేపీతో కలిస్తే బెటరని చెబుతున్నారట.
తన జన్మదినం సందర్భంగా భారీ ఎత్తున కార్యక్రమాలతో ప్రజల మది కొల్లగొడుతామని, క్యాడర్ ను ఉత్సాహం పరుద్దామన్న సందేశాన్ని - సూచనల్ని విజయకాంత్ ఇస్తుండగా వారు మాత్రం ఈ ఖర్చులెవరు భరిస్తారని ప్రశ్నిస్తున్నారట. ఇన్నాళ్లు పార్టీ కోసం తాము ఖర్చు పెట్టామని.. అధికారంలో లేకపోతే ఇక ఖర్చు పెట్టడం అసాధ్యమని.. రాష్ట్రంలో ఎలాగూ అధికారంలోకి రాలేం కాబట్టి కనీసం కేంద్రంలోని బీజేపీతో కలిసినా కొంతవరకు పనులు చేయించుకోవచ్చని అంటున్నారట. దీంతో విజయకాంత్ జన్మదిన వేడుకలు కూడా మొన్నటి ఎన్నికల ఫలితాల్లో డీఎండీంకే పరిస్థితులులాగా తుస్సుమనడం ఖాయమని తమిళనాట వినిపిస్తోంది.