Begin typing your search above and press return to search.

అప్ప‌నంగా అప్పగించి..ఇప్పుడు అడ్డంగా బుక్కైన చంద్ర‌బాబు!!

By:  Tupaki Desk   |   22 May 2020 12:30 PM GMT
అప్ప‌నంగా అప్పగించి..ఇప్పుడు అడ్డంగా బుక్కైన చంద్ర‌బాబు!!
X
అధికారంలో ఉన్న‌ప్పుడు ఎడాపెడ పారిశ్రామిక‌వేత్త‌లకు రాయితీలిచ్చి.. మీకొంత‌.. మాకొంత అనే వ్య‌వ‌హ‌రం న‌డిపించారు. ఇప్పుడు ఫ‌లితం అనుభ‌వించ త‌ప్ప‌దు. ఈ వ్య‌వ‌హారంలో ఇప్పుడు టీడీపీ అధినేత‌ - మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చిక్కారు. భారత్‌ లో ఆర్థిక నేరగాళ్ల జాబితాలో చంద్ర‌బాబు అప్ప‌నంగా ప్రాజెక్టులు అప్ప‌గించిన వ్య‌క్తి కూడా ఉన్నాడు. ఆయ‌నే బీఆర్ శెట్టి. ఆయ‌నెవ‌రో కాదు ఎన్ ఎంసీ వ్యవస్థాపకులు బీఆర్ శెట్టి. ఈయ‌న బ్యాంక్ ఆఫ్ బరోడాకు 250 మిలియన్ డాలర్లు టోకరా వేశారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కోర్టులో విచార‌ణ కొన‌సాగుతోంది. ఈయ‌న‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ద‌గ్గ‌రి సంబంధం ఉంది. బీఆర్ శెట్టి కి చంద్రబాబు తో సన్నిహిత సంబంధాలున్నాయంటూ రాజ్యసభ స‌భ్యుడు విజయ్ సాయిరెడ్డి చేసిన ఆరోపణలు నిజ‌మేన‌ని చెబుతున్నాయి.

ఎంఎన్‌ సీ వ్యవస్థాపకుడు - బీఆర్ ఎస్ వెంచ‌ర్స్ చైర్మ‌న్‌ బీఆర్ శెట్టి చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు వ‌చ్చారు. బీఆర్ శెట్టి అమరావతిలో వేలకోట్లతో హెల్త్ సిటీ పెట్ట‌డానికి అప్ప‌ట్లో ముఖ్య‌మంత్రిగా ఉన్న చంద్రబాబుతో ఒప్పందం చేసుకున్నారు. 2016లో ముఖ్యమంత్రి చంద్రబాబును బీఆర్ శెట్టి దంపతులు కలిశారు. హెల్త్ కేర్ రంగంలో నవ్యాంధ్రప్రదేశ్‌ లో రూ.12 వేల కోట్లు పెట్టుబడులు పెడతామని ముందుకొచ్చారు. దీనిలో భాగంగా ఒక హెల్త్ యూనివర్సిటీ - టూరిజం - హాస్పిటాలిటీ - ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చర్‌ రంగాల్లో పెట్టుబడులు పెడ‌తామ‌ని ఒప్పందం కుదుర్చుకున్నారు.

వీటితోపాటు 10 వేల సీటింగ్ కెపాసిటీతో ఒక కన్వెన్షన్ సెంటర్‌ ను ఏర్పాటు చేస్తామని - భారతదేశంలోనే అతి పెద్దది నిర్మిస్తామ‌ని చెప్పారు. 3,500 బెడ్లు ఉన్న వరల్డ్ క్లాస్ ఆస్ప‌త్రి నిర్మాణం - ఇందులో 1,500 బెడ్లు ఉన్న ఆస్ప‌త్రిని అమరావతిలో ఏర్పాటు చేయడం, కర్నూలులో 300 పడకల ఆస్ప‌త్రి - రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఆస్ప‌త్రుల నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అమరావతిని ప్రపంచంలోనే అగ్ర రాజధానిగా తీర్చిదిద్దే క్రమంలో 18 గోల్ఫ్‌కోర్సులను కూడా ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. వీటన్నిటి కోసం ముఖ్య‌‌మంత్రి గా ఉన్న చంద్ర‌బాబు నాయుడు బీఆర్ శెట్టికి రాజధాని అమ‌రావ‌తి ప్రాంతంలో భూమి కూడా కేటాయించారు. బీఆర్ శెట్టికి కేంద్ర ప్ర‌భుత్వం పద్మశ్రీ అవార్డు తో స‌త్క‌రించింది కూడా.

ఇప్పుడు అత‌డు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.1,800 కోట్లు రుణం తీసుకుని ఎగ్గొట్టేశాడు. బీఆర్ శెట్టి గ్యారెంటీ కింద దేశంలోని ప్రధాన నగరాల్లో తనకున్న ఆస్తులను పెట్టాడు. అయితే ఈ ఆస్తులను ఇతరులకు బదిలీ చేయడం లేదా విక్ర‌యించ‌డం చేయరాదని బెంగళూరు కోర్టు పేర్కొంది. అనంత‌రం జూన్ 8వ తేదీకి విచార‌ణ వాయిదా వేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌‌లో ఆరోగ్య రంగంలో ఎన్‌ ఎంసీ సంస్థ అతిపెద్ద హెల్త్ కేర్ ప్రొవైడర్‌ గా గుర్తింపు పొందింది. అయితే కొన్ని నెలలుగా సంస్థ నష్టాలు బాట పట్టడం - స్థిరత్వం కోల్పోయింది. మార్చిలో సంస్థకు 6.6 బిలియన్ డాలర్లు అప్పు ఉంది. ఇప్పుడు మ‌రింత పెరిగి ఉంటుంది. అత‌డిపై విచార‌ణ జ‌రిగితే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లోనూ డొంక క‌దిలే అవ‌కాశం ఉంది.