Begin typing your search above and press return to search.
కేసీఆర్ మాట చెప్పారంటే... విజయశాంతి అదిరిపోయే సెటైర్లు
By: Tupaki Desk | 15 Jun 2021 12:30 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ విషయంలో దూకుడుగా స్పందించే అతికొద్ది మంది నేతల్లో మాజీ ఎంపీ విజయశాంతి ఒకరు. తనదైన శైలిలో ఆమె గులాబీ దళపతిపై విరుచుకుపడుతుంటారు. ఇదే ఒరవడిలో తాజాగా కేసీఆర్ చేసిన ప్రకటనపై విజయశాంతి ఫైర్ అయ్యారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి సమీక్ష సందర్భంగా సీఎం కేసీఆర్ అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆయా పనుల్ని తానే స్వయంగా చెక్ చేస్తానని, హఠాత్తుగా వచ్చి పరిశీలిస్తానని అన్నారు. అధికారులు అందుబాటులో ఉండి తానడిగిన రిపోర్టులివ్వాలని పేర్కొంటూ తేడా వస్తే స్పాట్‌లోనే సస్పెన్షన్లు ఉంటాయని సీరియస్‌గా హెచ్చరించారు. దీనిపై విజయశాంతి పంచ్‌లు వేశారు.
సీఎం కేసీఆర్ మాటలకు భయపడాల్సిన పనిలేదని అధికారులకు బాగా తెలుసు అని విజయశాంతి ఎద్దేవా చేశారు. ``కేసీఆర్ ఒక మాట అన్నారంటే… అది జరిగే పని కాదని అందరికీ తెలుసు. వస్తున్నా వస్తున్నా అనడమే గాని… ఓట్ల పండగప్పుడు తప్ప ఫాంహౌస్, ప్రగతి భవన్ వదిలి కేసీఆర్ రారని అందరికీ బాగా అర్థమైంది`` అంటూ కామెంట్లు చేశారు. నాగార్జునసాగర్ ఎన్నికలప్పుడు 15 రోజుల్లో మళ్ళీ సాగర్ వచ్చి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని కేసీఆర్ చెప్పారని, అయితే నెలన్నర దాటినా అతి గతీ లేదని విజయశాంతి ఫైర్ అయ్యారు. హుజుర్ నగర్ ఎన్నికల సమయంలో కూడా 15, 20 రోజుల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వరకు పర్యటించి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానన్నారు... ఏడాదిన్నరైనా సారు అడ్రస్ లేడని వ్యాఖ్యానించారు.
దీంతో పాటుగా వరంగల్ నగరంలోని పరిణామాలను సైతం విజయశాంతి ప్రస్తావించారు. ``చాలా ఏళ్ళ కిందట వరంగల్ నగరం మురికివాడలకు వచ్చి వారికి కొత్త ఇళ్ళు కట్టిస్తానని, దావత్ చేసుకోవడానికి 5 నెలల్లో మళ్లీ వస్తానని అన్నారు. ఏం జరిగిందో చెప్పక్కర్లేదు. తాజా చెకింగులు, వార్నింగుల అర్థమేంటో నేను చెప్పాల్సిన పనిలేదు. ఆయన దర్శనం కావాలంటే మళ్ళీ అక్కడ ఓట్ల పండగ రావాలేమో. ఒకవేళ తప్పదు అనుకుంటే ఏవో కొన్ని చోట్లకు వెళ్ళి ముఖం చూపించి తిరిగిరావడమే తప్ప, ఈ సీఎం గారు తన పనితీరుతో తెలంగాణను ఉద్ధరిస్తారంటే చిన్న పిల్లలు కూడా నమ్మే పరిస్థితి లేదు`` అని తనదైన వైలిలో విజయశాంతి కామెంట్లు చేశారు. మరి రాములమ్మ చేసిన వ్యాఖ్యలకు టీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో మరి!