Begin typing your search above and press return to search.
విజయశాంతి..జగన్ పైన..లాజిక్ లేకుండా పోయిందే!
By: Tupaki Desk | 28 April 2019 2:30 PM GMTవంక లేనమ్మ డొంక పట్టుకుని ఏడ్చిందట..అలా ఉంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి. తెలంగాణలో ఎన్నికల ముచ్చట్లు ముగిసిన విజయశాంతి మాత్రం హల్ చల్ చేస్తోంది. ఇప్పుడప్పుడే ఎన్నికలు లేవు. స్థానిక సంస్థల ఎన్నికలున్నా.. వాటిల్లో ఎలాగూ అధికార పార్టీ హవానే ఉంటుంది.
అయితే విజయశాంతి మాత్రం బాగానే హల్చల్ చేస్తున్నారు. ఈమె వచ్చే ఎన్నికలను లక్ష్యంగా చేసుకుందని - అందుకే ఇలా స్పందిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.
మరి ఇలా డిసైడ్ కావడం బాగానే ఉంది కానీ - ఈమె ఉన్నట్టుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మీద రెచ్చిపోవడమే ఒకింత ఆశ్చర్యకరంగా ఉంది. సోషల్ మీడియా పోస్టు ద్వారా విజయశాంతి స్పందించింది.
దాని సారాంశం ఏమిటంటే..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఫెడరల్ ఫ్రంట్ విషయంలో జగన్ సమర్థిస్తూ ఉన్నారని, అది చాలా తప్పు అని విజయశాంతి అంటున్నారు. ఎందుకంటే..తెలంగాణలో కేసీఆర్ కాంగ్రెస్ నుంచి భారీగా ఫిరాయింపులను ప్రోత్సహించారట. ఏపీలో ఫిరాయింపు రాజకీయాలను వైఎస్సార్సీపీ తప్పు పట్టింది కదా - అలాంటి రాజకీయాలే చేస్తున్న కేసీఆర్ ను జగన్ ఎలా సమర్థిస్తారు? అని విజయశాంతి ప్రశ్నించింది.
ఈమె లాజిక్ బాగానే ఉంది కానీ.. ఈ లాజికల్ ప్రశ్న వేసే ముందు విజయశాంతి తమ పార్టీ తీరును లాజికల్ గా ప్రశ్నించుకోలేదా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు పరిశీలకులు.
ఫిరాయింపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడు అని చెప్పి కేసీఆర్ ను జగన్ సమర్థించకూడదు అని కాంగ్రెస్ వాదిస్తోంది.. విజయశాంతి అలా చెబుతోంది. మరి ఇదే లాజిక్ ను కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు కు ఎందుకు అప్లై చేయడం లేదు? అంటే ఆమె కానీ - కాంగ్రెస్ పార్టీ కానీ ఏమని సమాధానం ఇవ్వగలదు?
కేసీఆర్ కన్నా భారీ స్థాయిలో ఫిరాయింపుదారులకు పెద్ద పీట వేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయనతోనేమో కాంగ్రెస్ పార్టీ స్నేహం చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనే పొత్తు పెట్టుకుని పోటీ చేసింది.చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కు నమ్మకమైన మిత్రుడిగా సాగుతూ ఉన్నాడు!
మరి ఇదంతా కాంగ్రెస్ కు కనపడటం లేదా? అరే.. చంద్రబాబు నాయుడు ఫిరాయింపు రాజకీయాలు చేశాడు..కేసీఆర్ లాంటి వాడే అతడూ.. కాబట్టి అతడితో స్నేహం చేయకూడదు అని కాంగ్రెస్ పార్టీ మడికట్టుకుందా? లేదు కదా? ఫిరాయింపు రాజకీయాలను చేసిన చంద్రబాబుతో స్నేహం చేస్తూ కాంగ్రెస్ ఇతరులకు మాత్రం నీతులు చెప్పడం విడ్డూరంగా లేదా? ఈ విషయం గురించి విజయశాంతే పోస్టు పెట్టే ముందే ఆలోచించుకోవాల్సింది!