Begin typing your search above and press return to search.
చైనా కోరలు పీకేసిన మనోడు
By: Tupaki Desk | 6 Aug 2017 6:08 AM GMTడ్రాగన్ ను బలమైన దేశంగా అభివర్ణించటం మామూలే. మిగిలిన వ్యవహారాల్లో మాదిరే.. క్రీడల్లోనే చైనా ఆటగాళ్లను గట్టి పోటీగా అభివర్ణిస్తుంటారు. తాజాగా సరిహద్దు వివాదాల నేపథ్యంలో చైనా తీరు దేశీయంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సరిహద్దుల్ని అక్రమంగా ఆక్రమించుకునే దుష్టబుద్ధి చైనాకు ఎక్కువే.
తన చుట్టూ ఉన్న దేశాల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టే చైనా.. తాజా డోక్లాం వివాదంలో భారత్ తో వ్యవహరిస్తున్న తీరుపై భారతీయుల్లో ఆగ్రహావేశాల్ని పెంచుతుంది. ఇలాంటి వేళలో భారత బాక్సర్ విజేందర్ సింగ్.. చైనాకు చెందిన బాక్సర్ పై అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
చైనా బాక్సర్ జుల్ఫికర్ మైమైతియాలిని ఓడించిన విజేందర్.. బాక్సింగ్ లో భారత సత్తాను మరోసారి చాటాడని చెప్పాలి. ప్రొఫెషనల్ బాక్సింగ్ లోకి అడుగు పెట్టిన విజేందర్ వరుసగా తొమ్మిదో విజయాన్ని సొంతం చేసుకోవటమే కాదు.. తాను తిరుగులేని బాక్సింగ్ చాంఫియన్ అన్న విషయాన్ని మరోసారి చాటుకున్నాడు.
తాజా పోటీలో విశేషం ఏమిటంటే.. తొలి ఐదు రౌండ్లలో విజేందర్ తన అధిపత్యాన్ని ప్రదర్శించిన.. తర్వాత రెండు రౌండ్లలో మాత్రం డీలా పడ్డాడు. కానీ.. చివరకు పోరాడి సంచలన విజయం సాధించాడు. తాజా విజయంతో డబ్ల్యూటీవో ఓరియంటల్ సూపర్ మిడిల్ వెయిట్.. ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. చైనా బాక్సర్ మీద విజేందర్ విజయం భారతీయుల్లో రెట్టింపు ఆనందాన్ని మిగిల్చిందని చెప్పక తప్పదు.