Begin typing your search above and press return to search.
వాడి బలుపు ఆ రాష్ట్ర పోలీసులు తీయలేరా?
By: Tupaki Desk | 9 Aug 2017 12:43 PM GMTఇష్టారాజ్యంగా వ్యవహరించి.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉదంతంలో కించిత్ పశ్చాతాపం లేకపోవటం తర్వాత.. కేసును విచారిస్తున్న పోలీసులకు చుక్కలు చూపిస్తున్న వికాస్ తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కుమారుడు వికాస్ బరాలా చేసిన పాడు పని అందరికి తెలిసిందే. పూటుగా తాగేసి.. రోడ్డు మీద కారులో తన మానాన తాను పోతున్న అమ్మాయి (సదరు మహిళ ఒక మహిళా ఐఏఎస్ అధికారిణి కుమార్తె) వెంట పడటమేకాదు.. ఆమెను తెగ ఇబ్బంది పెట్టటం.. ఒకదశలో ఆమె కారుకు తన కారును అడ్డం పెట్టి లైంగికంగా వేధించేందుకు సైతం తెగబడిన అతడి దుర్మార్గాన్ని.. పోలీసులు అడ్డుకున్నారు.
ఈ వ్యవహారం జాతీయస్థాయిలో ప్రముఖంగా రావటంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చేసిన ఎదవ పనిని పలువురు తప్పు పట్టినా.. బీజేపీ నేతలు కిమ్మనకుండా ఉన్న వారే ఎక్కువమంది కనిపిస్తున్నారు. కొందరునేతలు పాలకపక్షానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేసి.. బాధితురాలిని కించపరిస్తూ మాట్లాడిన వైనం హర్యానా బీజేపీ మీదనే కాదు.. బీజేపీ ఇమేజ్ ను పెద్ద ఎత్తున డ్యామేజ్ చేసిందని చెప్పాలి.
ఇదిలా ఉంటే.. తాజాగా పోలీసులు వికాస్ ను మరోసారి విచారించారు.వికాస్ తప్పు చేసినట్లుగా నిరూపించే సీసీ కెమేరా పుటేజ్ ఉన్నప్పటికీ.. అతగాడి వైఖరిలో పెద్దగా మార్పు రాలేదన్న మాట వినిపిస్తోంది. విచారణ కోసం పోలీసుల ముందు వెళ్లిన అతగాడు.. అధికారులకు తన రక్త.. మూత్ర నమూనాల్ని ఇచ్చేందుకు నిరాకరించటం గమనార్హం. వికాస్ తో పాటు.. అతడితో పాటు ఉన్న మరో వ్యక్తి ఇద్దరూ లా స్టూడెంట్స్‌కావటంతో.. చట్టాలపై తమకున్న అవగాహనతోనే శాంపిల్స్ ఇచ్చేందుకు నిరాకరించినట్లుగా చెబుతున్నారు.
వికాస్ అతని స్నేహితుడు వ్యవహరిస్తున్న తీరుతో హర్యానా పోలీసులకు చుక్కలు కనిపిస్తున్నట్లుగా చెబుతున్నారు. తామున్న పరిస్థితుల్లో విచారణ ద్వారా వికాస్ నుంచి అదనపు సమాచారాన్ని సేకరించటం కష్టమైన నేపథ్యంలో.. ఈ ఉదంతానికి సంబంధించిన అదనపు సాక్ష్యాల్ని సేకరించే పనిలో పడ్డారు హర్యానా పోలీసులు. తమ విచారణను స్పీడప్ చేశామని.. బాధితురాలికి న్యాయం చేస్తామన్న ఆశాభావాన్ని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ఈ ఉదంతం మీద హర్యానా పోలీసులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నట్లుగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వికాస్ విషయంలో పోలీసులు నిస్సహాయంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. నిందితుడు తమ ఎదుట హాజరు కావాలన్న నోటీసుల్ని జారీ చేసినా.. వికాస్ మాత్రం వాటిని తీసుకోవటానికి నిరాకరించటం గమనార్హం. చివరకు.. అతడి ఇంటి గేటుకు నోటీసుల్ని అంటించారు. ఇదిలా ఉంటే తీవ్ర విమర్శల్లో ఇరుక్కుపోయిన వికాస్ తండ్రి.. హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ బరాలా మాత్రం.. బాధితురాలి తనకు కుమార్తె లాంటిదని వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.