Begin typing your search above and press return to search.
వీల్ ఛైర్ లోనే విక్రమ్ గౌడ్ అరెస్ట్
By: Tupaki Desk | 3 Aug 2017 9:11 AM GMTతెలివి తప్పు లేదు. కానీ.. అతితెలివి అసలుకే ఎసరు వచ్చేలా చేస్తుంది. మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ వ్యవహారం చూస్తే.. అతగాడిని ఏం అనాలో అర్థం కాని పరిస్థితి. చిన్న లాజిక్ ను మిస్ అయి.. తన జీవితంలో దిద్దుకోలేని తప్పు చేయటం అతనికి మాత్రమే సాధ్యమవుతుందేమో? ఇప్పుడు పరిస్థితుల్లో తప్పు చేసి తప్పించుకోవటం చాలా కష్టమని.. సాంకేతికత పెరిగిపోయి.. పోలీసింగ్ మహా చురుగ్గా ఉన్న వేళ.. సినిమాటిక్ ఆలోచనలు కొంప ముంచుతాయన్న చిన్నపాటి ఆలోచన విక్రమ్ గౌడ్ కు కలగకపోవటం గమనార్హం.
ప్రజల్లో.. కుటుంబ సభ్యుల్లో సానుభూతి సంపాదించుకునేందుకు తనకు తానే సుపారి ఇప్పించుకొని మరీ తుపాకీ కాల్పులు జరిపించుకున్న వైనం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. కేవలం సినిమాల్లో మాత్రమే కనిపిస్తాయనుకునే ఈ తరహా ఆలోచనలు రియల్ లైఫ్ లోనూ సాధ్యమేనని.. విక్రం గౌడ్ లాంటి ఉంటారన్న విషయాన్నితాజా ఉదంతం స్పష్టం చేసిందని చెప్పాలి.
విక్రమ్ గౌడ్ పై కాల్పులు జరిగాయన్న విషయం బయటకు వచ్చిన వెంటనే.. పోలీసులు సీన్ లోకి ఎంటర్ కావటం.. తమదైన క్వశ్చన్లతో ఒకటి తర్వాత ఒకటిగా ఆధారాలు సేకరిస్తూ.. విచారించటంతో లోగుట్టు మొత్తం బయటకు వచ్చేసింది. ఆర్థిక కష్టాలతో పాటు.. రాజకీయంగా ఎదిగేందుకు వీలుగా తనను కాల్చమని డబ్బులు ఇచ్చి కిరాయి మూకతో చేయించుకున్న వ్యవహారం బయటకు వచ్చింది
.
దీంతో.. కాల్పులు జరిగాయన్న సానుభూతి పోయి.. విక్రంగౌడ్ అతితెలివిని అందరూ ఛీ కొట్టే పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విక్రంగౌడ్ ను.. తాజాగా పోలీసులు కోర్టు ఎదుట హాజరుపర్చారు. ఇందులో భాగంగా ఆసుపత్రి బయట వరకు వీల్ ఛైర్ లో తీసుకొచ్చిన పోలీసులు.. పోలీసు వ్యాన్ లో ఎక్కించే సమయంలో అతగాడు పడిన ఇబ్బంది చూస్తే.. చేజేతులారా సమస్యల్ని కొని తెచ్చుకోవటం ఎలా అన్నది విక్రమ్‌ను చూస్తే అర్థమవుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో అరెస్ట్ చేసిన పోలీసులు నాంపల్లి కోర్టుకు తరలించారు.