Begin typing your search above and press return to search.
లక్కీ నెంబరు అంటూ 3సార్లు కాల్పించుకున్నాడా?
By: Tupaki Desk | 4 Aug 2017 4:24 AM GMTసెల్ఫ్ స్కెచ్ తో తన మీద తానే కాల్పులు జరుపుకున్న మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కు సంబంధించిన మరికొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఆసుపత్రిలో కోలుకున్న అతన్ని వైద్యులు డిశ్చార్జ్ చేయటం.. ఆ వెంటనే అరెస్ట్ చేసిన పోలీసులు అతన్ని నేరుగా నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. అనంతరం కోర్టు ఆదేశాల నేపథ్యంలో జ్యూడిషియల్ రిమాండ్ నిమిత్తం విక్రమ్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు.
అండర్ ట్రయల్ కింద అతనికి 8407 కేటాయించారు. తన లక్కీ నెంబరు 3 అని చెప్పుకునే విక్రమ్ గౌడ్.. అదే మూడో తేదీన అరెస్ట్ అయి జైలుకు వెళ్లటం గమనార్హం.
చేసేది ఎదవ పని.. అయినా కూడా తన లక్కీ నెంబరును మాత్రం గుడ్డిగా ఫాలో అయిన వైనం ఈ ఎపిసోడ్ లో కనిపిస్తుంది. తనపై కాల్పులు జరిపించుకునేందుకు విక్రమ్ గౌడ్ పడిన ఆరాటం వింటే విస్మయం చెందాల్సిందే. తనపై కాల్పులు జరిపేందుకు ఎంపిక చేసుకున్న నంద అనే వ్యక్తి.. ఆ పని చేసేందుకు భయపడగా.. అతడ్ని అనరాని మాటలు అని.. అతన్ని రెచ్చగొట్టి మరీ తనకు కావాల్సిన పనిని పూర్తి చేసుకున్న వైనం విచారణలో బయటపడింది.
ఈ కేసుకు సంబంధించి విక్రమ్ గౌడ్ తో పాటు ఐదుగురు నిందితుల్ని జైలుకు తరలించారు. విక్రమ్ కు ఉన్న ఆరోగ్య ఇబ్బందుల నేపథ్యంలో జైలు అధికారులకు కోర్టు కొన్ని సూచనలు చేసింది. ఆసుపత్రిలో వైద్యం చేయలేని పరిస్థితుల్లో ఉస్మానియా లేదంటే గాంధీ ఆసుపత్రులకు తరలించాలంది. దీనిపై జైలు సూపరింటెండెంట్ నిర్ణయం తీసుకోవచ్చన్నారు. తాను కోరుకున్న ఆపరేషన్ పూర్తి చేసేందుకు అనంతపురం జిల్లా కదిరికి చెందిన నందకుమార్‌ను విక్రమ్ ఎంపిక చేసుకున్నారు.
అయితే.. తాను అనుకున్నట్లు చేయటానికి నంద ఒక దశలో విపరీతమైన భయానికి గురయ్యాడు. అయితే.. అతడ్ని రెచ్చగొట్టే ఎస్ ఎంఎస్ లు పంపటం.. తానే స్వయంగా అనంతపురం వెళ్లిన వైనం బయటకు వచ్చింది. నంద తండ్రి తీవ్ర అస్వస్థతకు గురి కావటంతో.. ఆయన్ను పుట్టపర్తి సత్యసాయి ఆసుపత్రిలో చేర్చారు. ఆ విషయాన్ని విక్రమ్ తో చెప్పగా నందకు రూ.1.5లక్షలు.. కారు ఇచ్చి పంపాడు. అయితే.. తాను కోరుకున్నట్లుగా పని పూర్తి చేసేందుకు నంద సుముఖంగా ఉండకపోవటంతో.. నువ్వు మగాడివి కాదా? నీలో మగతనం లేదా? లాంటి మేసేజ్ లు పంపి రెచ్చగొట్టే ప్రయత్నం చేసినట్లుగా బయటకువచ్చింది. తన మేసేజ్ లకు నంద రియాక్ట్ కాకపోవటంతో తానే అనంతపురం వెళ్లి నందను కలిసి.. తాను ఇచ్చిన కారును వెనక్కి తెచ్చుకున్నట్లుగా తెలుస్తోంది.
తాను అనుకున్న ప్లాన్ ను అమలు చేయటానికి మాత్రం తన లక్కీ నెంబరు అయిన మూడును పలు సందర్భాల్లో విక్రమ్ వాడటం కనిపిస్తుంది. తనపై కాల్పులు జరపటానికి ఒక రోజు ముందు తనపై కాల్పులు జరపటానికి ఎంపిక చేసుకున్న ఇండోర్ వాసి రయిస్ ను తన ఇంటికి పిలిపించుకున్న విక్రమ్.. తన లక్కీ నెంబరు మూడు అని.. తనపై మూడుసార్లు కాల్పులు జరపాలని కోరుకున్నట్లుగా చెబుతున్నారు. రెండు చేతులపైనా.. మూడోది కడుపు పక్క నుంచి వెళ్లేలా కాల్చాలని కోరటం గమనార్హం. తాను అనుకున్న ప్లాన్ ను మూడు నెలల ముందే అనుకున్న అది జరగలేదు. అంతేకాదు.. తాను అనుకున్నట్లుగా జరగటానికి ఘటన చోటు చేసుకున్న మూడు రోజుల ముందు కూడా ఒక విఫల యత్నం జరిగినట్లుగా తెలుస్తోంది. దరిద్రపు పని చేసినప్పుడు కాలం కలిసి వచ్చే ఛాన్సే లేదన్న విషయం తాజా ఎపిసోడ్‌ను చూసినప్పుడు ఇట్టే తెలియక మానదు.