Begin typing your search above and press return to search.

ఇస్మార్ట్ ల్యాండర్ విక్రమ్ మేకిన్ ఆదిభట్ల

By:  Tupaki Desk   |   7 Sep 2019 7:48 AM GMT
ఇస్మార్ట్ ల్యాండర్ విక్రమ్ మేకిన్ ఆదిభట్ల
X
చంద్రయాన్ 2లో భాగంగా అత్యంత కీలకమైన ల్యాండింగ్ ఆఖరి నిమిషాల్లో ఫలితం ఏమిటన్నది తేలకుండా పోయిన సంగతి తెలిసిందే. చంద్రుడి మీదకు ల్యాండర్ ల్యాండ్ కావటానికి ఐదు నిమిషాల ముందు సంకేతాల్ని పంపే వ్యవస్థ నిలిచిపోవటంతో.. అల్లంత దూరాన ఉన్న చంద్రుడి వద్ద ఏం జరిగిందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. చంద్రయాన్ 2 ప్రయోగంలో కీలకమైన ల్యాండర్ విక్రమ్ కు సంబంధించిన ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి. దీన్ని తెలుగు నేల మీద తయారు చేయటం విశేషం.

ప్రయోగం మొత్తంలో కీలకమైన ల్యాండర్ విక్రమ్ ను హైదరాబాద్ మహానగరానికి శివారు అయిన ఆదిభట్లలో తయారు చేశారు. విక్రమ్ ల్యాండర్ ను చంద్రుడి మీదకు పంపే క్రమంలో అందులోని ఇంజిన్ ను మండిస్తారు. ఈ సమయంలో మోటారు ట్యూబ్ నుంచి విడుదలయ్యే ఉష్ణోగ్రత 600 సెల్సియస్ డిగ్రీలుగా ఉంటుంది. ఇంత భారీ ఉష్ణోగ్రతను తట్టుకునేందుకు వీలుగా సిలికాన్ ఫ్యాబ్రిక్ ను ఏర్పాటు చేశారు.

ల్యాండర్ మోటార్ల బయట థర్మల్ ప్రొటెక్షన్ ఇచ్చే ఈ మెటీరియల్ ను హైదరాబాద్ శివారులో ఉండే ఆదిభట్ల ఏరోస్సేస్ సంస్థ తయారు చేసింది. దేశ వ్యాప్తంగా రక్షణ.. ఏవియేషన్ రంగాల్లో అనేక ప్రాజెక్టులకు సంబంధించిన పరికరాల్ని ఈ సంస్థ తయారు చేస్తుంటుంది. చంద్రయాన్ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన విక్రమ్ ల్యాండర్ నిర్మాణంలో మన తెలుగు నేల మీద ఉన్న కంపెనీ కీలకంగా మారటం విశేషంగా చెప్పాలి. తెలుగువారందరికి ఇదో గుర్వకారణంగా చెప్పకతప్పదు.