Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే మేకపాటి.. నియోజ‌క‌వ‌ర్గానికి 10 కోట్లు.. రీజ‌న్ ఇదేనా?

By:  Tupaki Desk   |   11 Dec 2022 1:30 PM GMT
ఎమ్మెల్యే మేకపాటి.. నియోజ‌క‌వ‌ర్గానికి 10 కోట్లు.. రీజ‌న్ ఇదేనా?
X
నెల్లూరు జిల్లా, ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. త‌న నియోజ‌క‌వ‌ర్గానికి త‌న సొంత నిధులనుంచే రూ.10 కోట్లు వెచ్చించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. నిజానికి రాష్ట్రంలోని ప్ర‌తినియోజ‌క వ‌ర్గాన్నిఅభివృద్ధి చేసే బ‌ధ్య‌త‌ను ప్ర‌భుత్వం తీసుకోవాలి. కానీ, ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం మాత్రం కేవ‌లం బ‌ట‌న్ నొక్కే బాధ్య‌త ను మాత్ర‌మే తీసుకుంది. దీంతో నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిస్థితి ఎక్క‌డి గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్టుగా మారింది.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో త‌న సోద‌రుడు గౌతం రెడ్డి మ‌ర‌ణంతో ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకున్న విక్ర‌మ్ రెడ్డి.. త‌నే నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

ఈ క్ర‌మంలో ఆయ‌న తన సొంత నిధుల నుంచి రూ.10 కోట్లు కేటాయిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ నిధితో ఆత్మకూరు డెవలప్ మెంట్ ఫోరం ఏర్పాటు చేసి, ఆత్మకూరు అభివృద్ధికి కృషి చేయనున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఎమ్మెల్యేగా తన వంతు బాధ్యతగా రూ.10 కోట్లు అందిస్తున్నట్లు ప్రకటించారు.

నియోజవకర్గంలో ముందుగా మౌలిక వసతుల పెంపుతో పాటుగా విద్య‌, ఉపాధి అవకాశాల కల్పన దిశగా చర్చలు చేసి..నిర్ణయాలు తీసుకోనున్న‌ట్టు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ప్రతీ ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని విక్రమ్ రెడ్డి పిలుపునిచ్చారు. రాబోయేరోజుల్లో నియోజ‌క‌వ‌ర్గాన్ని సుంద‌రంగా తీర్చి దిద్ద‌నున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న స‌మ‌స్య‌ల‌ను స‌త్వ‌ర‌మే ప‌రిష్క‌రిస్తామ‌న్నారు.

అలా అంద‌రికీ సాధ్య‌మేనా?

ఇప్పుడు విక్ర‌మ్ రెడ్డి త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి రూ.10 కోట్లు కేటాయించారు. ఎందుకంటే మ‌ళ్లీ ఎన్నిక‌లు వ‌స్తున్నాయి.. అభివృద్ధి గురించి ప్ర‌జలు ప్ర‌శ్నిస్తున్నార‌నే కార‌ణంగా. అయితే.. అన్ని చోట్లా ప‌రిస్థితి ఇలానే ఉంది. మ‌రి ప్ర‌బుత్వం ప్ర‌తి ఒక్క ఎమ్మెల్యేకు రూ.కోటి చొప్పున ఇస్తాన‌ని చెప్పినా.. ఇప్ప‌టి వ‌ర‌కు రూపాయి ఇవ్వ‌లేదు.

ఈ ప‌రిణామాలతో నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి అలానే ఉంది. మ‌రి విక్ర‌మ్‌రెడ్డి అంటే.. పారిశ్రామిక‌వేత్త‌..క‌నుక వెంట‌నే రూ.10 కోట్లు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. మ‌రిమిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇది సాధ్య‌మా? ప్ర‌భుత్వం ఇప్ప‌టికైనా స్పందించి నియోజ‌క‌వ‌ర్గాల‌ను డెవ‌ల‌ప్ చేసేందుకు కృషి చేయాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.