Begin typing your search above and press return to search.
బర్గర్ కోసం లాంగ్ జర్నీ.. 725 కి.మీ హెలిక్యాప్టర్‌లో వెళ్లిన లవ్‌బర్డ్స్ ..!
By: Tupaki Desk | 5 Dec 2020 12:30 AM GMTవినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే..! బర్గర్ తినేందుకు ఓ ప్రేమజంట లాంగ్ జర్నీకి వెళ్లింది. ఎంత లాంగ్ జర్నీ అంటే 725 కిలోమీటర్లు. అది కూడా హెలీక్యాప్టర్‌లో. రోజు సేంద్రియ వంటకాలు తిన్న ఈ జంటకు రొటీన్ఫుడ్ బోర్కొట్టిందట. దీంతో లాంగ్‌జర్నీ చేసి బర్గర్లు తిని వచ్చేశారు. రష్యాకు చెందిన విక్టర్ మార్టినోవ్ పెద్ద వ్యాపారవేత్త. చాలా రిచ్ పర్సన్ అతడికి ఓ గర్ల్‌ఫ్రెండ్ ఉంది. వీళ్లిద్దరి ఆరోగ్యం కోసం కొన్నేళ్లుగా సేంద్రియ ఆహారాన్ని తీసుకుంటున్నారు. అయితే రోజు అవే ఆహారపదార్థాలు తిని బోర్ కొట్టేసింది.
వాళ్లకు మెక్‌డోనాల్డ్స్ బర్గర్ తినాలని అనిపించిదట. దగ్గర్లో స్టోర్స్ లేవు. దీంతో అనుకున్నదే తడువుగా 725 కిలోమీటర్లు ప్రయాణించి క్రిమియాలో ఉన్న మెక్‌డోనాల్ట్స్ అవుట్‌లెట్‌కు వెళ్లి అక్కడ బర్గర్లు తిన్నారు. వీళ్ల హోటల్ బిల్లు 4,800 అయితే.. హెలీకాప్టర్‌కు కోసం మాత్రం రూ. 2 లక్షలు అయ్యిందట. ఈ విషయంపై మార్టినోవ్ ఏమంటాడంటే.. ‘ రోజూ ఒకే తరహా ఫుడ్ తిని నాకు బోర్‌కొట్టింది. ఏంచేయని చెప్పండి అందుకే హెలికాప్టర్ బుక్‌చేసుకొని బర్గర్ తినొచ్చా. ఇదేదో సంచలనం కోసం చేయలేదు. నాకు ఆ సమయంలో అలా అనిపించింది అందుకే అలా చేశా’ అని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ఈ విషయం సొషల్మీడియాలో తెగవైరల్ అయ్యింది. ‘ నువ్వు గ్రేట్ బ్రో.. బర్గర్ కోసం 728 కిలోమీటర్లు అది కూడా హెలిక్యాప్టర్‌లో వెళ్లావంటే మాటలు కావు. అయినా డబ్బున్నోడు తలుచుకుంటే కానిది ఏముంది.’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.