Begin typing your search above and press return to search.
అర్థంలేని వదంతులు - ఏటీఎం - బ్యాంకులకు ప్రజల పరుగు!
By: Tupaki Desk | 19 April 2020 1:30 AM GMTకరోనా మహమ్మారి నేపథ్యంలో భారత్ లాక్ డౌన్‌లో ఉంది. ఈ సమయంలో పేదలను, అసంఘటిత రంగ కార్మికులను, ఉద్యోగులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ చర్యలు చేపట్టాయి. కేంద్రం ఇప్పటికే రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. జన్ ధన్ లేదా రేషన్ కార్డు లింక్ ఉన్న అకౌంట్లలో రూ.500 నుండి రూ.1,500 వరకు జమ చేస్తున్నాయి ప్రభుత్వాలు. తెలంగాణలో ఇటీవల జమ చేయడం ప్రారంభించారు. వాటిని తీసుకోవడానికి ప్రజలు ఏటీఎంల వద్ద క్యూ కడుతున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఏటీఎంల వద్ద డబ్బులు తీసుకోవడానికి కూడా టోకెన్లు ఇచ్చే పరిస్థితి. పనులు లేకపోవడంతో చేతిలో డబ్బులు లేక ప్రభుత్వం అకౌంట్లలో వేస్తున్న డబ్బులను తీసుకోవడానికి ఎండలో సైతం గంటలకొద్ది నిలబడుతున్నారు. ఈ క్రమంలో కామారెడ్డి ప్రాంతంలో బ్యాంకు వద్ద క్యూలో నిలుచున్న ఓ మహిళ శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు.
ఇప్పటికే చేతిలో డబ్బులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు కొంతమంది పుట్టిస్తున్న వదంతులు ప్రజలను బ్యాంకులకు పరుగులు పెట్టేలా చేస్తున్నాయి. జన్ ధన్ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయని, వాటిని తీసుకోకుంటే వెనక్కి పోతాయనే వదంతులు వినిపించడంతో కామారెడ్డి ప్రాంతంలో జనం ఏటీఎంలు, బ్యాంకుల వద్దకు పరుగులు పెట్టారు. కొన్నిచోట్ల టెంట్లు ఏర్పాటు చేశారు. డబ్బులు తీసుకోవడానికి వచ్చే నేపథ్యంలో సామాజిక దూరం కూడా పాటించడంలేదు కొంతమంది.
బ్యాంకుల్లో జమ అయిన సొమ్ము వెనక్కి వెళ్లదు. కానీ కొంతమంది వదంతులు సృష్టించడంతో ప్రజలు ఏటీఎంలు, బ్యాంకుల వద్దకు పరుగులు పెట్టారు. కొన్ని ప్రాంతాల్లో పది నుండి పదిహేను గ్రామాలకు ఓ బ్యాంకు ఉంది. ఇక్కడి ప్రజలు గంటలకొద్ది వరుసలో నిలబడి ఇబ్బందులు పడుతున్నారు.