Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ : నాటుసారా కాస్తూ పట్టుబడ్డ గ్రామ వాలంటీర్!
By: Tupaki Desk | 11 April 2020 12:30 PM GMTఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత - ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని - ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ వెనుకడుగు వేయకుండా అమల్లోకి తీసుకోని వచ్చిన వ్యవస్థ.. గ్రామ వాలంటీర్ వ్యవస్థ. మొదట్లో ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థ పై విమర్శలు చేసిన వారే ..ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం కరోనా రాష్ట్రంలో పంజా విసురుతున్న సమయంలో ఏపీలో గ్రామ వాలంటీర్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోంది.
కరోనా వైరస్ సింటమ్స్ ఉన్నవారిని గుర్తించడం, గ్రామాల్లో ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించడం సహా చాలా కార్యక్రమాల్లో యాక్టీవ్ గా పనిచేస్తున్నారు. అయితే , కొందరు చేసే తప్పుడు పనుల వల్ల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ వలంటీర్లకు చెడ్డ పేరు వస్తుంది. బాధ్యతగా ఉండాల్సిన తరుణంలో దారి తప్పాడు ఓ గ్రామ వాలంటీర్. గ్రామంలో నాటుసారా తయారు చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు దొరికిపోయాడు.
ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో జరిగింది. ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే .. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం పెద్ద శంకర్లపూడిలో నాటు సారా తయారుచేస్తూ.. గ్రామ వాలంటీర్ పట్టుబడ్డాడు. గ్రామానికి శివార్లలో కొందరు సారా కాస్తున్నారన్న ఇన్ ఫర్మేషన్ తో ఎక్సైజ్ సిబ్బంది సీఐ వెంకటరమణ ఆధ్వర్యంలో దాడులు చేశారు. ఈ క్రమంలో 30 లీటర్ల సారాతో పాటు ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి చెడుదారులు పట్టే యువకులను కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హెచ్చరించారు. కరోనాను అరికట్టడానికి లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ..మద్యం దొరకడం లేదు. దీన్ని క్యాష్ చేసుకోవడానికి గ్రామవాలంటీర్ మరికొంతమందితో కలిసి నాటుసారా కాయడానికి సిద్దమైనట్టు తెలుస్తుంది.