Begin typing your search above and press return to search.
గ్రామ వలంటీర్ దారుణం.. మూడు నెలలుగా బాలికపై అత్యాచారం
By: Tupaki Desk | 31 May 2022 10:30 AM GMTబాధ్యతాయుతమైన పోస్టులో ఉన్న ఓ గ్రామ వలంటీర్ పాడు పనిచేశాడు. ప్రజలకు సేవ చేయాల్సిన వాడు కామంతో కళ్లు మూసుకుపోయి ఓ బాలికపై బలత్కారానికి దిగాడు. ఈ దారుణం బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది. మూడు నెలలుగా సాగుతున్న ఈ తంతు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలో ఓ బాలిక(15)పై గ్రామ వాలంటీర్ మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు ఉపాధి కోసం వేరే గ్రామంలో ఉంటుండడంతో అమ్మమ్మతో కలిసి బాలిక కొరిశపాడులో ఉంటోంది. ఇదే అదునుగా భావించిన వాలంటీర్ బాలికపై కన్నేశాడు.
ఇప్పటికై పెళ్లి అయ్యి పిల్లలున్న రావిపాటి కోటయ్య అనే గ్రామ వాలంటీర్ బాలికను బెదిరించి గత మూడు నెలలుగా ఈ అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని బాధిత బాలిక తల్లిదండ్రులకు తాజాగా చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితురాలిని చికిత్స కోసం ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
వాలంటీర్ల ఆగడాలు ఏపీలో ఎక్కువైపోతున్నారు. ఈ మధ్య కాలంలో తరచుగా వలంటీర్లు అత్యాచారాలు జరపడం ఎక్కువైంది. పింఛన్లు, సంక్షేమ పథకాలు ఇవ్వడానికి వెళుతూ ఒంటరిగా ఉండే బాలికలు, మహిళలపై అత్యాచారాలు చేస్తున్న ఘటనలు వెలుగుచూశాయి. అప్పట్లో చిత్తూరు జిల్లాలోని పుంగనూరు మండలం గూడురుపల్లిలో ఓ బాలిక అవ్వకు పింఛన్ ఇవ్వడానికి ఇంటికి వెళ్లారు.
ఆ సమయంలో అవ్వ లేకపోవడం.. బాలిక ఒంటరిగా చిక్కడంతో అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే గ్రామ వలంటీర్ కావడం.. బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించి కొందరు స్థానిక నాయకులు పంచాయితీ పెట్టారు. బాలికకు భరణం చెల్లించేందుకు ఒప్పించడానికి ప్రయత్నించారని తెలిసింది. అయితే పంచాయితీ విఫలం కావడంతో పుంగనూరు పోలీసులకు బాధితురాలు ఎట్టకేలకు ఫిర్యాదు చేసింది. దీంతో వలంటీర్ చేసిన దారుణం వెలుగుచూసింది.