Begin typing your search above and press return to search.
దారుణానికి ఒడిగట్టిన గ్రామ వలంటీర్ పవన్ కల్యాణ్!
By: Tupaki Desk | 23 July 2020 5:30 PM GMTప్రభుత్వ సంక్షేమ.. అభివృద్ధి కార్యక్రమాలు.. పథకాలు ప్రజలందరికీ చేరువ చేయాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం గ్రామ పరిపాలన వ్యవస్థలో వలంటీర్లను తీసుకొచ్చింది. వలంటీర్లతో ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరువ చేస్తోంది. అందుకోసం గ్రామ వలంటీర్లు అనే కొత్త పోస్టును సృష్టించి ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ఈ వ్యవస్థ అందరి ప్రశంసలు పొందుతుండగా కొందరి వలన ఆ వ్యవస్థకు మచ్చ వస్తోంది. తాజాగా మరో వలంటీర్ దారుణానికి ఒడిగట్టాడు. అభంశుభం తెలియని ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.
దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం పెదరాజుపాళెంలో వలంటీర్ గా పవన్ కల్యాణ్ పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆ గ్రామంలోని ఓ బాలిక (9)పై అత్యాచారానికి పాల్పడ్డాడు. లైంగిక దాడికి పాల్పడడంతో ఆ బాలిక పరిస్థితి విషమంగా మారింది. దీంతో కంగారుపడిన బాలిక తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాలిక స్థితిని చూసి వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తెలిపిన వివరాలతో గ్రామ వలంటీర్ పవన్ కల్యాణ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రికి వెళ్లి బాలికను పరిశీలించిన పోలీసులు పవన్ కల్యాణ్ పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా వలంటీర్ పవన్ కల్యాణ్ ను అదుపులోకి తీసుకున్నారు.