Begin typing your search above and press return to search.
మరోసారి గ్రామ వలంటీర్ నోటిఫికేషన్ !!
By: Tupaki Desk | 8 Aug 2019 7:27 PM GMTఏపీ ప్రభుత్వం.. ప్రజా సంక్షేమ పథకాలను క్రమం తప్పకుండా ప్రతి ఇంటికి చేర్చడానికి నియమిస్తున్న గ్రామవలంటీర్ల నియామకానికి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలై ఇంటర్వ్యూలు కూడా పూర్తయిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా మరో సారి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈసారి రాష్ట్ర స్థాయిలో కాకుండా జిల్లాల వారీగా నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. వాస్తవానికి ఇది తాజా నిర్ణయం. ఇప్పటికే ఎంపిక చేసిన వలంటీర్లలో కొందరు ఆఫర్ లెటర్లు తీసుకోకపోవడం, కొన్ని చోట్ల ఉద్యోగాన్ని తిరస్కరించడం వల్ల ఖాళీలు ఏర్పడ్డాయి. కొన్ని చోట్ల అర్హులు కూడా దొరకలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 18 వేల పోస్టులు ఇవి ఖాళీగా ఉన్న నేపథ్యంలో వాటి కోసం మరోసారి నోటిఫికేషన్ రానుంది.
గ్రామ వలంటీర్ల వ్యవస్థ దేశంలోనే కొత్త ప్రయోగం. ఇప్పటివరకు ప్రభుత్వ వ్యవస్థల వద్దకే వచ్చి ప్రజలు సంక్షేమ పథకాలను పొందేవారు. కానీ ముఖ్యమంత్రి జగన్ సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రతి ప్రభుత్వ పథకం నేరుగా ఇంటికే చేర్చాలన్న లక్ష్యంతో ీఈ వ్యవస్థను ఏర్పాటుచేశారు. 50 ఇళ్లకు ఒక వలంటీర్ సేవలు అందిస్తారు. ప్రతి అర్హుడికి నిర్ణీత కాలంలోపు పథకం చేరుతుంది. ప్రస్తుతం ఈ పోస్టుకు 5 వేలు గౌరవ వేతనం నిర్ణయించారు.