Begin typing your search above and press return to search.
రసమయికి కార్యకర్తల సెగ!!
By: Tupaki Desk | 19 Oct 2018 10:10 AM GMTటీఆర్ ఎస్ నేతలకు ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సమస్యలను పరిష్కారానికి ఏం చేశారు.. మా అభ్యున్నతికి చేసింది ఏంటి అంటూ మాజీ ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నారు స్థానిక ప్రజలు. తాజాగా నిరసనల బారిన రసమయి బాల కిషన్ పడ్డారు.
తాజా మాజీ ఎమ్మెల్యే - తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్ రసమయి బాలకిషన్ కు కార్యకర్తల నుంచి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. కరీనగర్ జిల్లా ఎల్ ఎండీ కాలనీకి బతుకమ్మ సంబరాలు వీక్షించేందుకు ఆయన వెళ్లారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చి బాలకిషన్ ను చుట్టముట్టారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఇద్దరు కార్యకర్తలను చితకబాదారు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన స్థానికులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.
అలాగే, బుధవారం రాత్రి బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించేందుకు ముస్కాని పేటకు వెళ్లిన బాల కిషన్ కు ఇదే తరహా అనుభవం ఎదురైంది. ఇటీవల అంబేద్కర్ - జ్యోతిరావు ఫూలే విగ్రహాల ఏర్పాటుకు స్థానిక యువకులు పిలిచినప్పుడు బాలకిషన్ వెళ్ల లేదు. దీంతో ఆగ్రహానికి గురైన వారంతా అప్పుడు రాలేదు.. ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు అని ప్రశ్నించారు. నిరసన హోరు నుంచి పోలీసుల సాయంతో బయటపడ్డారు.
తెలంగాణ ఎన్నికల వేళ కరీంనగర్ జిల్లాలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. టీఆర్ ఎస్ అభ్యర్థులపై స్థానికులు తిరగబడటం ఇదే తొలిసారి. ఈ ప్రభావం ఓటింగ్ పై పడుతుందేమోనన్న అనుమానాలు లేకపోలేదు.