Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ సినిమా.. అందరి దృష్టీ దాని మీదే
By: Tupaki Desk | 4 July 2017 4:48 PM GMTసినిమా అన్నాక హీరో ఎలా ఉంటాడో.. విలనూ ఉంటాడు. పూర్తి స్థాయి విలన్ కాకపోయినా ప్రతినాయక లక్షణాలతో ఎవరినో ఒకరిని చూపించక తప్పదు. ఇక నందమూరి తారకరామారావు జీవిత కథతో సినిమా అనగానే అందరి దృష్టి హీరో కంటే కూడా విలన్ మీదికి మళ్లింది. నటుడిగా.. రాజకీయ నేతగా ఎన్టీఆర్ గొప్పదనం గురించి కొత్తగా తెలుసుకునేది తక్కువే కావచ్చు. సినిమాల్లోకి రాకముందు ఎన్టీఆర్ జీవిత విశేషాలు మాత్రమే పాజిటివ్ కోణంలో ఆకర్షించేవి.
ఐతే ఎన్టీఆర్ జీవితానికి సంబంధించి ప్రతికూల విషయాలు జనాల్ని ఎంతగానో ఆకర్షిస్తాయి. వాటి గురించి జనాలు తెలుసుకోవాలనుకుంటారు. ముఖ్యంగా ఆయన రాజకీయ జీవితంలో విలన్లు చాలామందే కనిపిస్తారు. ఒకసారి నాదెండ్ల భాస్కర రావు కారణంగా తాత్కాలికంగా సీఎం పదవి కోల్పోయిన ఎన్టీఆర్.. మరోసారి చంద్రబాబు కారణంగా శాశ్వతంగా ఆ పదవికి దూరమయ్యారు. మరోవైపు లక్ష్మీపార్వతిని కూడా ఎన్టీఆర్ జీవితంలో విలన్ గా చిత్రీకరించేవారూ లేకపోలేదు. ఐతే ఎన్టీఆర్ మీద తీయబోతున్న సినిమాలో ప్రధాన విలన్ పాత్ర ఎవరిది అన్న చర్చ ఇప్పుడు జోరుగా నడుస్తోంది.
రామ్ గోపాల్ వర్మ తీయబోయే సినిమాలో బాలయ్యే హీరోనా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ బాలయ్యే హీరో అయితే ఈ చిత్రంలో మెయిన్ విలన్ గా ఎవరిని చూపిస్తారన్నది ఆసక్తికరం. నాదెండ్ల రోల్ విషయంలో అందరికీ స్పష్టత ఉంది. కాబట్టి ఆ విషయంలో ఇబ్బంది లేదు.ఎన్టీఆర్ కోణంలో చూస్తే చంద్రబాబే ఆయనకు పెద్ద విలన్. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల దృష్టిలో చూస్తే లక్ష్మీ పార్వతే ప్రధాన విలన్. ఐతే ఇద్దరిలో ఎవరిని విలన్ గా చూపించినా.. వివాదాలు మామూలుగా ఉండవు. బాలయ్య హీరోగా సినిమా తీస్తే చంద్రబాబును విలన్ గా చూపించే సాహసం చేయకపోవచ్చు. దాన్ని కప్పెట్టేస్తే సినిమా అంత ఆసక్తి రేకెత్తిస్తుందా అన్నది సందేహం. లక్ష్మీపార్వతిని విలన్ గా చూపిస్తే ఆమె ఊరుకునే అవకాశం లేదు. మరి వర్మ ఏం చేస్తాడో చూడాలి.