Begin typing your search above and press return to search.
బొచ్చెడు ఇసుక ప్రజలకు ఇవ్వలేకపోతున్నాం.. వైసీపీ ఎమ్మెల్యే ఆవేదన!
By: Tupaki Desk | 2 Jun 2020 6:30 AM GMT‘ఇసుక మాయమైపోతోంది. ఏపీలోని వాగులు, నదులు, వంకల్లో లారీల్లో నింపిన ఇసుక గ్రామాలు,పట్టణాలకు రావడం లేదు. ఎక్కడికి పోతోంది. ఎవరి పంచన చేరుతోంది. గ్రామాల ప్రజలకు బొచ్చెడు, గుప్పెడు ఇసుక కూడా అందడం లేదు’ అంటూ అధికార వైసీపీకి చెందిన వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
గుంటూరు జిల్లా కలెక్టరేట్ లో ఇసుక పై నిర్వహించిన సమీక్షలోవాస్తవ పరిస్థితిని ఎమ్మెల్యే కళ్లకు కట్టారు.
ఇసుక రీచ్ నుంచి పల్లెలు, పట్నాలకు అని పేరు చెప్పి బయలు దేరిన లారీలు, ట్రాక్టర్లు అక్కడి చేరడం లేదని.. మాయమైపోతున్నాయని.. ఎక్కడకు వెళుతున్నాయో కలెక్టర్, మంత్రులు ఆరాతీయాలని ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కోరారు.
ప్రజలకు బొచ్చెడు ఇసుక ఇవ్వలేని పరిస్థితిలో తమ ప్రభుత్వం ఉందని.. చెప్పుకోవడానికే ఏదోలా ఉందని ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలా కలెక్టరేట్ లో ఇసుకపై నిర్వహించిన సమావేశంలోనే అధికార పార్టీ ఎమ్మెల్యే ఏకంగా ఇసుక దందాలపై హాట్ కామెంట్స్ చేయడం వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టింది. ఎమ్మెల్యే వీడియో వైరల్ కావడంతో ప్రభుత్వంపై ఇంటాబయటా విమర్శలు మొదలయ్యాయి. మరి ఈ ఇసుక సమస్యను ఇప్పటికైనా తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.
వీడియోను కింద చూడొచ్చు..