Begin typing your search above and press return to search.

జేసీ ప్రభాకర్ రెడ్డిని కేసులు వదలడం లేదే?

By:  Tupaki Desk   |   6 Oct 2020 5:39 PM GMT
జేసీ ప్రభాకర్ రెడ్డిని కేసులు వదలడం లేదే?
X
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కష్టాలు తీరడం లేదు. గత చంద్రబాబు ప్రభుత్వంలో వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం గద్దెనెక్కాక కూడా అదే రీతిలో వ్యవహరించారనే విమర్శలను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే జేసీ ట్రావెల్స్ బస్సుల అక్రమాల కేసులో ఇప్పటికే జైలు పాలైన ఆయన తిరిగి బయటకు రావడం.. మరో కేసుల్లో అరెస్ట్ కావడం.. ఇలా ఆ తంతు కొనసాగుతూనే ఉంది.

తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డిపై మళ్లీ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ తాడిపత్రి పట్టణ పోలీసులు తాజాగా కేసులు నమోదు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఆయన తనయుడు అశ్విత్ రెడ్డితోపాటు 32మంది టీడీపీ నేతలు, కార్యకర్తలపై కేసు నమోదైంది.

కరోనా పాజిటివ్ బారినపడి హైదరాబాద్ లో చికిత్స తీసుకొని క్వారంటైన్ పూర్తి చేసుకొని నిన్ననే జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రికి వచ్చారు. ఈ సందర్భంగా తాడిపత్రిలో ఆయనకు టీడీపీ కార్యకర్తలు, నేతలు భారీగా తరలివచ్చి స్వాగతం పలికారు.

దీంతో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ మళ్లీ తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేయడంతో జేసీ మరోసారి కష్టాల్లో పడ్డారు. ఇలా వరుసగా జేసీ తప్పులపై కేసులు నమోదు చేస్తుండడం.. ఆయనను అరెస్ట్ చేసి జైలుకు పంపుతుండడం కొద్దిరోజులుగా సాగుతూనే ఉంది.