Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ సడలింపు : 2 గంటల్లోనే రూల్స్ బ్రేక్..కేంద్రం ఫైర్ !
By: Tupaki Desk | 20 April 2020 7:30 AM GMTప్రజల ప్రాణాలను కాపాడుకుంటేనే ప్రగతి రథాన్ని పట్టాలెక్కించడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన లాక్ డౌన్ మినహాయింపులు సోమవారం నుంచి అమల్లోకి వస్తున్నాయి. అయితే - లాక్ డౌన్ సడలింపులు అమల్లోకి వచ్చిన తొలి రెండు గంటల్లోనే కేరళ లాక్ డౌన్ సడలింపు రూల్స్ ను బ్రేక్ చేసింది. కేంద్రం లాక్ డౌన్ నుండి కొన్నింటికి మినహాయింపు మాత్రమే ఇచ్చింది. అయితే , కేరళలో మాత్రం లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేశారా అనేలా అక్కడి పరిస్థితులు కనిపిస్తున్నాయి.
అక్కడి వాతావరణం. లాక్ డౌన్ ప్రకటించడానికి ముందు ఎలాంటి వాతావరణం ఉండేదో.. సడలింపు తరువాత అవే పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి నివేదికను అందజేయాలని ఆదేశించింది. లాక్ డౌన్ సడలింపులు ఆరంభమైన వెంటనే జనం రోడ్ల మీదికి వచ్చారు. బస్సు సర్వీసులూ ఆరంభం అయ్యాయి. 30 కిలోమీటర్ల దూరం వరకు రాకపోకలు సాగించేలా ప్రైవేటు బస్సులు - ఇతర వాహనాలు కూడా రోడ్డు పైకి వచ్చాయి. మాంసం విక్రయల దుకాణలు తెరచుకున్నాయి. బార్బర్ షాపులు జనంతో క్రిక్కిరిసిపోయి ఉండటం కనిపించింది. పాఠశాలలు - జిరాక్స్ సెంటర్లు - బుక్ స్టోర్లు యథా ప్రకారం ఓపెన్ అయ్యాయి.
దీనితో కేరళ ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ చట్టం నిబంధనలను ఉల్లంఘించినట్లు కేంద్రం గుర్తించింది. దీనిపై కేరళ ప్రభుత్వానికి లేఖ రాసింది. పూర్తి స్థాయి నివేదికను అందజేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ భల్లా ఆదేశించారు. ఈ మేరకు ఆయన కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని ఆయన తెలిపారు. దేశంలో కరోనా వైరస్ వ్యాపిస్తోన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ తాము జారీ చేసిన నిబంధనలను ఉల్లఘించవద్దంటూ అజయ్ భల్లా ఇది వరకే అన్ని రాష్ట్రాలు - కేంద్ర పాలిత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. నిబంధనలను ఉల్లంఘించిన రాష్ట్రాల్లో సడలింపును ఉపసంహరిస్తామని హెచ్చరించారు. అయినా కూడా కేరళ సాధారణ పరిస్థితులు నెలకొనడం పట్ల కేంద్రం అసంతృప్తి ని వ్యక్తం చేసింది. దీనితో ఇప్పుడు కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.