Begin typing your search above and press return to search.
ప్రమాదాల నుంచి వీరంతా బయటపడ్డారే!
By: Tupaki Desk | 12 Sep 2017 3:30 PM GMTప్రమాదం చెప్పిరాదు! అలాగని వీరికే ప్రమాదం సంభవిస్తుందనీ చెప్పలేం. ప్రమాదం అనేది ఎంతటి వారికైనా రావొచ్చు. వారు అధికారులా? ఆటగాళ్లా? రాజకీయ నేతలా? అనే దాంతో సంబంధం ఉండదు. ఇటీవల చోటు చేసుకుంటున్న ప్రమాదాలు ఇలాంటివే. అయితే, అనూహ్యంగా ఆయా ప్రమాదాల నుంచి ప్రముఖులు తప్పించుకుని బయట పడి.. ప్రాణాలు కాపాడుకున్నారు. నిన్నటికి నిన్న ఏపీ డీజీపీ సాంబశివరావు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పశ్చిమ గోదావరి నుంచి విజయవాడ వస్తున్న సమయంలో డీజీపీ కాన్వాయ్ తణుకు వద్ద ఎదురుగా ఎళ్తున్న లారీని బలంగా ఢీకొంది.
స్పీడ్ బ్రేకర్ల వద్ద ఎదురు లారీ సడన్ బ్రేక్ లు వేయడంతో డీజీపీ కాన్వాయ్ ఆ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. అయితే, ఈ ప్రమాదంలో డీజీపీకి ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక, ఏపీ మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం కూడా మంగళవారం ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. ఇదిలావుంటే, భారత క్రికెటర్ సురేశ్ రైనా కూడా మంగళవారం పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఘజియాబాద్ నుంచి కాన్పూర్ కు వెళుతున్న సమయంలో రైనా ప్రయాణిస్తున్న రేంజ్ రోవర్ ఎస్‌యూఏ కారు టైరు పేలిపోయింది.
దాంతో కొద్దిపాటి కుదుపునకు గురైన కారు అదుపు తప్పింది. ఆ సమయంలో కారును రైనా మెల్లగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం వల్లే పెద్ద ప్రమాదం తప్పిందని స్థానిక పోలీసులు తెలిపారు. దులీప్ ట్రోఫీలో ఇండియా బ్లూ జట్టుకు రైనా సారథిగా వ్యవరిస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే రైనా అభిమానులు ఆయనకు ఏమీ కాకూడదని కోరుకుంటూ భగవంతుడుని ప్రార్థిస్తూ.. ట్విట్ చేశారు. మొత్తానికి వీరంతా లక్కీగా ప్రమాదాల నుంచి బయటడపపడ్డారు.