Begin typing your search above and press return to search.

వైరల్: కౌశిక్ రెడ్డి మరో ఆడియో లీక్.. ఏముందంటే?

By:  Tupaki Desk   |   14 July 2021 3:46 AM GMT
వైరల్: కౌశిక్ రెడ్డి మరో ఆడియో లీక్.. ఏముందంటే?
X
హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్ చార్జిగా ఇన్నాళ్లు బలమైన నేతగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి భవితవ్యం ఒకే ఒక్క ఫోన్ కాల్ తో తలకిందులైంది. ఆ ఒక్క ఫోన్ కాల్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ హూజూరాబాద్ నాయకుడు దెబ్బకు కాంగ్రెస్ కు రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

రెండో ఆడియో లీక్ లో కాంగ్రెస్ పై, రేవంత్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి మండిపడ్డాడు. తాను ఏ తప్పు చేయలేదని.. పార్టీ అధ్యక్షుడే ఓడిపోతామని చెబుతుంటే నేను ఎలా కాంగ్రెస్ తరుఫున పోటీచేయాలని నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడికి ఫోన్ చేసి కౌశిక్ రెడ్డి మాట్లాడాడు.

తాజాగా లీక్ కాంగ్రెస్ నేతలు చేశారు. కాంగ్రెస్ నాయకుడు తిరుపతికి ఫోన్ చేసి కౌశిక్ రెడ్డి మాట్లాడిన ఆడియో బయటపడింది. ఈ ఆడియోతో కౌశిక్ రెడ్డి మరింతగా బుక్ అయ్యాడు.

తాజాగా లీక్ అయిన ఆడియో కలకలం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ మండలం కొత్తపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకుడు తిరుపతికి ఫోన్ చేశారు. తాను ఏ తప్పు చేయలేదంటూ కాంగ్రెస్నేతలకు ఫోన్చేసి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

ఉప ఎన్నిక దగ్గరపడుతున్న క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ నాయకులు విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారని.. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థి ప్రకటించకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే ఇలా చేయాల్సి వచ్చిందని కౌశిక్ రెడ్డి రెండో ఆడియోలో మాట్లాడారు. ఇప్పటివరకు కష్టపడ్డామని.. ఇక సుఖపడే రోజులు వస్తున్నాయన్నారు. సహకరించాలని కోరుతున్నట్లుగా ఆడియోలో ఉ:ది. తాను స్వయంగా వచ్చి కలుస్తానంటూ హామీ ఇస్తున్నారు.

‘సాక్షాత్తూ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డియే మనం ఓడిపోతామని చెబుతుంటే మనమెట్లా పోటీచేయాలి? నేను చేసింది తప్పేమీ లేదు. రేవంత్ రెడ్డి అలా చెప్పినప్పుడు ఇక పోటీ ఏమన్నా ఉంటుందా? నేనేమి చేయాలి. బీజేపీ, టీఆర్ఎస్ నేతలు రోజూ తిరుగుతున్నారు. నేను రోజు అడిగితే వాళ్లు ఎవ్వరూ రాలేదు. మరి నేనేమి చేయాలి’ అని కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం నేతల తీరును ఆ ఆడియో కాల్ లో ఎండగట్టారు.

-కౌశిక్ రెడ్డికి మాణిక్కం ఠాగూర్ షాక్.. పరువునష్టం దావా

టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించేందుకు రూ.50 కోట్లు తీసుకున్నారంటూ కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్కం ఠాగూర్ సీరియస్ గా స్పందించారు. పాడి కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపారు. దీనిపై వారం రోజుల్లో రాతపూర్వకంగా క్షమాపణ చెప్పాలని.. లేదంటే కోటి రూపాయల నష్టపరిహారంతోపాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు.