Begin typing your search above and press return to search.
వైరల్: వ్యాక్సిన్ల కోసం పోటీ.. కిందపడి దొర్లి.. ఈ కష్టం చూడలేం
By: Tupaki Desk | 2 July 2021 7:30 AM GMTదేశంలోని మోడీ సర్కార్ కిందా మీదా పడి ఎట్టకేలకు 18-45 ఏళ్ల వారికి టీకాలను ఉచితంగానే వేస్తున్నట్టు ప్రకటించింది. జూన్ నెల నుంచి అందరికీ టీకాలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇన్నాళ్లు ఉన్న కొరతను నివారించింది. కోవిడ్ వ్యాక్సిన్లు ఇప్పుడు భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు దాదాపు 34 కోట్ల మందికి టీకాలు వేశారు. ఇప్పుడు కూడా ఈ డ్రైవ్ ముందుకు సాగుతోంది. ఇక 18-45 ఏళ్ల మధ్య వయసున్న 9.61 కోట్ల మందికి వ్యాక్సిన్లను ఇస్తున్నారు.
అయితే ఇప్పటికీ పలు చోట్ల టీకాల కోసం భారీ క్యూలు, కి.మీల కొద్దీ వేచి ఉండడాలు.. తోపులాటలు, గొడవలు, కొట్లాటలు సాగుతున్నాయి. మధ్యప్రదేశ్ లోని ఓ టీకా కేంద్రంలో జనాలు టీకా కోసం ఎగబడ్డ తీరు వైరల్ గా మారింది. ఓ టీకా కేంద్రంలో వ్యాక్సిన్లు అందుబాటులో లేవని పుకార్లు వ్యాపించడంతో తొక్కిసలాట జరిగింది. జనాలు కింద పడి ఒకరిమీద ఒకరు పడిపోయి నానా అగచాట్లు పడ్డారు. ఈ వీడియో తీసి ఒకరు సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది.
మధ్యప్రదేశ్ లోని చింద్వారా జిల్లా సౌసర్ తహసీల్ పరిధిలోని లోధిఖేడ గ్రామంలోని టీకా కేంద్రంలో కోవిడ్19 టీకాలకు కొరత ఉందని ఒక పుకారు వ్యాపించింది. దీంతో టీకాలు వేసుకోవడానికి జనం తండోపతండాలుగా వచ్చి ఎగబడ్డారు. ఎంట్రీ డోర్ వద్ద తొక్కిసలాట జరిగి కింద పడిపోయారు. ఈ వీడియో కొందరు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది.
ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పించకపోవడం.. ప్రజల్లో భయాలు.. టీకాల కొరత వంటి కారణాల వల్లే ఈ దుస్థితి దాపురించిందని స్థానికులు మండిపడుతున్నారు. మధ్యప్రదేశ్ లో వైరల్ అయిన ఆ వీడియోలో జనాలు కనీసం మాస్క్ కూడా పెట్టుకోకుండా టీకాల కోసం ఎగబడ్డ తీరు కనిపించింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు టీకాలను ప్రతీ ఏరియాకు అందుబాటులో ఉంచితే ఇలా ఉపద్రవాలు జరగకుండా ఉంటాయని పలువురు కోరుతున్నారు.

Madhya Pradesh: Massive rush was seen at a #vaccination centre in Chhindwara; #Covid19 protocols violated. pic.twitter.com/KYPT7lqOih
— NDTV (@ndtv) July 1, 2021