Begin typing your search above and press return to search.

వైరల్ మీమ్.. భారత దేశంలో ఇదీ భౌతిక దూరం పరిస్థితి ..!

By:  Tupaki Desk   |   5 April 2021 3:11 AM GMT
వైరల్ మీమ్.. భారత దేశంలో ఇదీ భౌతిక దూరం పరిస్థితి ..!
X
దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ మళ్లీ అధికమైంది. ఏడాది దాటినా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. వారం రోజుల నుంచి కేసుల్లో ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. నిబంధనలు కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ హెచ్చరిస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని విధిగా పాటించాలని అంటున్నారు. కరోనా తొలినాళ్ల నుంచే మాస్క్ ధరించడం, భౌతిక దూరంపై సామాజిక మాధ్యమా్ల్లో చాలా మీమ్స్ వచ్చాయి. తాజాగా ఓ మీమ్ వైరల్గా మారింది. నిజానికి అది చూస్తే మనదేశంలో పరిస్థితి ఎలా ఉందో కళ్లకు కట్టినట్లు కన్పిస్తుంది.

ఎంతో మంది వైరస్ నిబంధనలు గాలి కొదిలేస్తున్నారు. అలాంటివారి మీమ్స్ ఎన్నో వచ్చాయి. కొవిడ్ నిబంధనలను పట్టించుకోని వారిని కొవిడియోట్స్ అంటున్నాం. కొందరైతే నియమాలు పట్టించుకోవడం కాకుండా తమ అజ్ఞానాన్ని మరింతగా బయటపెట్టుకుంటున్నారు. నిజానికి ఈ మీమ్ చూస్తే హాస్యంతో పాటు ఒకింత బాధ కలగకమానదు. నేటికీ మనదేశంలో ఇంతటి అజ్ఞానం ఉందా అనేది బాధకరమైన విషయమే.

కరోనా దృష్ట్యా అన్ని దుకాణాల్లోనూ భౌతిక దూరం పాటించాల్సిందేనని షరతులు విధించారు. అందుకే మార్క్ చేసి చిన్న చిన్న స్క్వేర్, సర్కిల్లు గీశారు. వాటిలో నిలబడి ప్రజలు షాఫింగ్ లేదా ఇతర కార్యకలాపాలు ముగించుకోవాల్సి ఉంది. కానీ పై ఫొటోలో మాత్రం నిర్దేశించిన ప్రదేశాల్లో కాకుండా జనాలంతా ఒకే దగ్గర కూర్చోవడం చూడొచ్చు. భౌతిక దూరం పాటించాలని నొక్కి చెప్పినా కొందరి తీరులో మార్పు రాకపోవడం గమనార్హం. అంతేకాకుండా గుర్తించిన ప్రదేశాల్లో చెప్పులు విడవడం మరికొంత బాధ కలిగించే అంశం.

దీనికి కారణాలు ఎన్నో ఉన్నాయి. ప్రపంచ దేశాలను వణికించే కరోనాపై అవగాహన లేక ఇలా చేశారా? లేక క్రమశిక్షణారాహిత్యమా? అనేది వారికే తెలియాలి. కానీ కొవిడ్ గురించి వారికి పెద్దగా భయం లేదనేది స్పష్టంగా కనిపిస్తుంది. ధైర్యం ఉంటే పర్లేదులే కానీ మరీ ఇంత అజ్ఞానంగా అక్కడ చెప్పులు విప్పి... కరోనా నిబంధనలను బేఖాతరు చేశారని నెటిజన్లు అంటున్నారు. అంతేకాకుండా మనందేశంలోని అజ్ఞానం పరిస్థితి ఇలా ఉందని అభిప్రాయపడుతున్నారు. ఈ ఒక్క మీమ్తో భౌతిక దూరం అంటే ఎవరు ఎలా అర్థం చేసుకుంటున్నారో తెలిసింది.