Begin typing your search above and press return to search.
వాహనాల తనిఖీ.. ఆ ఎస్ఐ దణ్ణం పెట్టేశాడే!
By: Tupaki Desk | 10 Oct 2017 5:15 AM GMTఇదేంటి జనాలతో దణ్ణాలు పెట్టించుకోవడమే కానీ, పోలీసులు కూడా దణ్ణాలు పెడతారా? అది కూడా సాధారణ జనాలకు దణ్ణం పెట్టే సీనుందా? అని ఆశ్చర్యం పోవద్దు! మన దేశంలో ఎప్పుడు ఎలాగైనా, ఏదైనా జరగొచ్చు. ఇప్పుడు అలాంటి వింత ఘటన.. ఓ పోలీస్ అధికారే రెండు చేతులూ ఎత్తి దణ్ణం పెట్టేసిన ఘటన ఒకటి మన ఏపీలోనే జరిగింది. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. అయితే, ఇదేదో.. స్మార్ట్ పోలీసింగో.. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగానో కాదు సుమా! అక్షరాలా వాహనాల తనిఖీలో భాగంగా ఓ ఎస్ఐ తన రెండు చేతులూ ఎత్తి దణ్ణం పెట్టేశాడు. లాఠీ పట్టుకోవడమే తప్ప చేతులెత్తి మొక్కడం తెలియని పోలీస్ ఇజానికి భిన్నంగా ఆ ఎస్ఐ చేసిన వింత ప్రవర్తన ఇప్పుడు సోషల్ మీడియాను ముంచెత్తుతోంది. ఆయన చేతులెత్తి దణ్ణం పెడుతున్న ఫొటో నెట్‌లో హల్ చల్ చేస్తోంది. మరి వివరాలేంటో తెలుసుకుందాం.. పదండి!
దేశంలో లెక్కలేనన్ని రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఇప్పటికే ఎన్నో సర్వేలు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రోడ్డు ప్రమాదాలు కామన్ అయిపోయాయి. మరోపక్క ఈ రోడ్డు ప్రమాదాలను నివారించడానికి పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వాహనదారులు మాత్రం ట్రాఫిక్ నియమాలు పాటించకుండా ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. హెల్మెట్ పెట్టుకోవడం నామూషీగా ఫీలవుతారు. సీట్ బెల్ట్ పెట్టుకోమంటే దర్పం అడ్డొస్తుంది. మరోపక్క, ట్రాఫిక్ చట్టాలను అమలు చేయలేరా అంటూ కోర్టులు పోలీసులపై కారాలు మిరియాలు నూరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక చేసేది లేక పోలీసులు జనాలపై జరిమానా కొరడా ఝళిపించేస్తున్నారు. అడుగడుగునా వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే అనంతపురంలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ జిల్లాలోని మడకసిరలో ఒక బైకుపై ఓ వ్యక్తి హెల్మెట్ లేకుండా ప్రయాణించాడు. అంతేకాదు, ఆ వ్యక్తితో పాటు ఆ బైక్‌పై ఏకంగా ఐదుగురు ఉన్నారు. అందులో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఇంత ప్రమాదకరంగా ఆ వ్యక్తి బైకుపై ప్రయాణిస్తోంటే ఏం చెప్పాలో తెలియక శుభకుమార్ అనే ఇన్స్‌పెక్టర్ వారికి దణ్ణం పెట్టేశాడు. `ఇలా ప్రయాణిస్తే ఎలా?` అని ప్రశ్నించాడు. దీనికి వాహనం నడుపుతున్న వ్యక్తి చిరునవ్వు నవ్వడంతో ఏం చేయాలో తెలియని ఆ ఎస్ఐ ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటూ హెచ్చరిస్తూ.. చేతులెత్తి దణ్ణం పెట్టేశారు. ఈ సీన్‌ను అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ఒకరు `క్లిక్`మనిపించాడు. అనంతరం దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఈ సీన్ అత్యధిక లైకులు పోగేసుకుని అత్యంత ఆసక్తికర జాబితాలో చోటు సంపాయించేసింది. సో.. ఆ పోలీసాయన దణ్ణం వెనుక స్టోరీ ఇదన్నమాట.