Begin typing your search above and press return to search.
వైరల్ అవుతున్న ఫొటో..
By: Tupaki Desk | 21 Jun 2019 9:56 AM GMTరాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడంతో.. కేంద్రంలో వైసీపీ తరుఫున అన్నీ తానై వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డికి కొండంత బలాన్నిచ్చింది. ఆయనను మరింత బలోపేతం చేసింది. ఇప్పుడు ఆయన రాజకీయంగా.. ఇటు ప్రభుత్వ పరంగా ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారు. నిన్ననే ప్రధాని నరేంద్ర మోడీ సైతం సమావేశానికి వస్తూ విజయసాయిని చూసి షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించారంటే విజయసాయి స్టామినాను అర్థం చేసుకోవచ్చు.
ఇక తాజాగా టీడీపీని వీడి బీజేపీలో చేరిన నలుగురు రాజ్యసభ టీడీపీ ఎంపీలు కూడా విజయసాయిరెడ్డితో కలిసి భోజనం చేస్తున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. వీరు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడిని కలిసి అక్కడ విందు ఆరగించారు. ఇందులో సీఎం రమేష్, సుజనా చౌదరి పక్కనే విజయసాయిరెడ్డి ఉండడం సంచలనంగా మారింది.
పక్కా టీడీపీ వాదులైన సీఎం రమేష్, సుజనా చౌదరీలు మొన్నటి వరకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలున్నాయి.కానీ వారు ఇప్పుడు టీడీపీని, అధినేత చంద్రబాబును వదిలి బీజేపీలో చేరారు. ఇప్పటికే ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలతో దగ్గరి సంబంధాలు నెలకొల్పుతున్న విజయసాయిరెడ్డిని కాకపట్టే పనిలో పడ్డట్టు తాజా ఫొటోలను బట్టి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
వెంకయ్యనాయుడుని కలిసి బీజేపీలో కలిపేయలని సీఎం రమేష్, సుజన చౌదరి , గరికపాటి, టీజీ వెంకటేశ్ లు లేఖ ఇచ్చారు. వెంకయ్య ఇచ్చిన విందులో పాల్గొన్నారు. వారి వెంట విజయసాయిరెడ్డి కూడా పాల్గొనడం.. వీరి పక్కనే భోజనం చేస్తూ కూర్చున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. . కేంద్రంలో బలమైన నేతగా ఎదుగుతున్న విజయసాయిరెడ్డి అవసరం కావడంతోనే పాత పగలన్నీ మరిచి ఆయనను మచ్చిక చేసుకునేందుకు ఈ టీడీపీ ఎంపీలు ప్రయత్నిస్తున్నారని ఆ ఫొటోలను బట్టి నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.