Begin typing your search above and press return to search.

వైరల్ పిక్: పవన్ కళ్యాణ్ 2009 టు 2021

By:  Tupaki Desk   |   4 April 2021 7:30 AM GMT
వైరల్ పిక్: పవన్ కళ్యాణ్ 2009 టు 2021
X
ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం రాజకీయ నాయకుల నైజం.. అయితే ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ తీరు వేరు. ఆయన ప్రసంగాల్లో .. నడవడికలో ఏదో చేసేద్దాం అని ఉంటుంది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే జనాలు ఆయన పార్ట్ టైం పాలిటిక్స్ ను నమ్మడం లేదు. అందుకే గెలిపించడం లేదు. నాటి ప్రజారాజ్యం నుంచి నేటి బీజేపీ రాజ్యం వరకు పవన్ ప్రస్తానం నాలుగు పార్టీలతో సాగింది. ఒక్క చంద్రబాబుతో జట్టుకట్టినప్పుడే మాత్రమే ఉమ్మడి విజయం సాధ్యమైంది.

2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవి కోసం తెగ కష్టపడ్డాడు. ఎండనక.. పగలనక తిరిగాడు. కానీ నాడు చిరంజీవిని ప్రజలు ఆదరించలేదు.ఇక 2014లో బీజేపీ-టీడీపీ కూటమితో జట్టుకట్టి తెగ కష్టపడ్డాడు. నాడు ఫలితం వచ్చింది. చంద్రబాబు సీఎంగా.. మోడీ పీఎంగా మారారు. కానీ వాగ్ధానాలు అమలు చేయని వీరితో కటీఫ్ చేసిన పవన్ 2019కి వచ్చేసరికి ఒంటరిగా మారారు.2019 ఎన్నికల ముందర బీఎస్సీ , కమ్యూనిస్టులతో కలిసి అతిపెద్ద పార్టీగా ఏపీలో మొదటిసారి లీడ్ తీసుకొని ఒంటరిగా పోటీచేశాడు. కానీ స్వయంగా రెండు చోట్ల పోటీచేసి కూడా జనసేనాని గెలవలేదు. ఒక్కసీటుకే పరిమితమయ్యాడు.

ఇప్పుడు ఇక కమ్యూనిస్టులు, బీఎస్సీతో కాదని బీజేపీతో జట్టుకట్టాడు . బీజేపీకి ఓటు వేయండని అంటున్నాడు. కేంద్రంలో అధికారంలో ఉండడంతో ఇది పవన్ కు కలిసి వస్తోంది. కానీ ఈ కొత్త బంధం ఎటు దారితీస్తుందో తెలియడం లేదు.ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తిరుపతిలో గడిచిన 12 ఏళ్లలో ఏఏ పార్టీకి ప్రచారం చేశాడన్నది ఫొటోలు తీసి దాన్ని తాజాగా సోషల్ మీడియాలో వైరల్ చేశారు. మీరూ దానిపై ఓ లుక్కేయండి..