Begin typing your search above and press return to search.
టీఆర్ ఎస్ కు బతుకమ్మ చీరల టెన్షన్!
By: Tupaki Desk | 28 Sep 2018 8:50 AM GMTగత ఏడాది దసరాకు ముందు తెలంగాణలో బతుకమ్మ పండుగ సందర్భంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని నాటి సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, నాణ్యత లేని పాలిస్టర్ చీరలను తమకు పంపిణీ చేయడంపై అప్పట్లో చాలామంది మహిళలు పెదవి విరిచారు. నాసిరకం చీరల కోసం గంటల తరబడి క్యూలో నిలుచోవాల్సి వచ్చిందని తెలంగాణ ఆడపడుచులు విమర్శలు గుప్పించారు. అయితే, ఎక్కడో కొన్ని చోట్ల కొంతమంది అసంతృప్తి వ్యక్తపరిచారని...కానీ, చాలామంది చీరల పంపిణీ పట్ల హర్షం వ్యక్తం చేశారని నాటి సీఎం కేసీఆర్ ...ఫొటోలు కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఈ సారి బతుకమ్మ పండుగకు ముందు మరోసారి చీరల పంపిణీ చేపట్టాలని టీ సర్కార్ నిర్ణయించింది.
అయితే, ఈ సారి చీరల పంపిణీ కార్యక్రమం సక్సెస్ కాకుంటే ...ముందస్తు ఎన్నికల ముందు పార్టీకి నష్టం కలుగుతుందని కొంతమంది టీఆర్ ఎస్ అభిమానులు భావిస్తున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన టీఆర్ ఎస్ కు పరమ భక్తుడైన ఓ సీనియర్ జర్నలిస్టు తన ఫేస్ బుక్ వాల్ పై పెట్టిన ఓ పోస్టు వైరల్ అయింది. తెలంగాణలో మహిళలు...తమకు పాలిస్టర్ చీరలు ఇవ్వడంపై అసంతృప్తితో ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. కాబట్టి , ఈ సారి కూడా పాలిస్టర్ చీరలిస్తే....ముందస్తుకు ముందు ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశముందని చెప్పారు. గతంలో రోజంతా క్యూలో నిలబడి చీర తీసుకున్న ఓ మహిళ...బాహాటంగా తన అసంతృప్తిని వెళ్లగక్కిందని చెప్పారు. ఆ నాసిరకం చీర తీసుకునేందుకు ఈ సారి రోజంతా క్యూలో నిలబడలేనని ఆమె చెప్పినట్లు వాల్ పై రాశారు. ఒకవేళ అదే చీర తన ఇంటికి తెచ్చిస్తే తీసుకోవడానికి అభ్యంతరం లేదని ఆమె చెప్పినట్లు తెలిపారు. మరి, ఆ పోస్ట్ ..సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లి..నాణ్యత గల చీరల పంపిణీ ఉంటుందేమో వేచి చూడాలి.