Begin typing your search above and press return to search.

వైరల్ పోస్టు: నల్లధనం పాయే.. తెలధనం పాయే.. మహానుభావుడవయ్యా మోడీ!

By:  Tupaki Desk   |   27 Feb 2021 2:30 PM GMT
వైరల్ పోస్టు: నల్లధనం పాయే.. తెలధనం పాయే.. మహానుభావుడవయ్యా మోడీ!
X
''అంతన్నాడు .. ఇంతన్నాడే' మోడీజీ చివరకు ధరలు బాది సామాన్యుడి నడి విరిచాడే'' అని ఇప్పుడు ఈ'ధరాఘాతం'పై దేశంలోని నెటిజన్లు సోషల్ మీడియా సాక్షిగా పాటలు పాడేసుకుంటున్నారు. మోడీ సార్'నల్లధనం' తెస్తానన్న దానిపై సెటైర్లు కురిపిస్తున్నారు.సోషల్ మీడియాలో ఇప్పుడు మోడీ సార్ ప్రజలపై మోపిన ధరల భారంపైనే నెటిజన్లు రగిలిపోతున్నారు. తమ క్రియేటివిటీని అంతా రంగరించి పోస్టులు పెడుతున్నారు.

తాజాగా సోషల్ మీడియాలో బాగా ప్రచారం అవుతున్న ఒక పోస్టు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మోడీ అంటే జర భయంతో మెలిగే'తెలుగుదేశం సోషల్ మీడియానే' దీన్ని షేర్ చేయడం విశేషం. ఆ పోస్టులో ఏముందుంటే''స్విస్ బ్యాంకు నుండి నల్లధనం తీసుకొని వస్తాను అని చెప్పి ప్రజల దగ్గర ఉన్న తెల్ల ధనం కూడా లాగేసుకుంటున్న మహానుభావుడు.'' అంటూ మోడీ పేరెత్తకుండానే ఆయన గాలి తీసేసిన వైనం చర్చనీయాంశమైంది.

ఎందుకంటే ఇప్పుడు ధరలు దేశ ప్రజలకు పెను భారమవుతున్నాయి. పెట్రోల్ రేటు రూ.100 కు చేరువ అవుతుంది. సామాన్యులకు నిత్య అవసరం.. అందరూ పనులకు వెళ్లే ఈ పెట్రోల్ పై రేటు పెంచి వారిని పీల్చిపిప్పి చేస్తోంది మోడీ సర్కార్. గత 2014కు ముందు కాంగ్రెస్ హాయంలో 14 కేజీల సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ ధర కేవలం 344.75 రూపాయలు మాత్రమే. అదే మోడీ వచ్చాక పెంచుకుంటూ పోతున్నాడు. ఇటీవల రూ.25 పెంచడంతో ధర 846కు పెరిగింది.

సబ్సిడీ సిలిండర్, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలకు దేశంలో రెక్కలు వచ్చాయి. అవి సామాన్యుడికి అందకుండా పెరిగిపోతూనే ఉన్నాయి. ఒక్కో సిలిండర్ పై రూ.25 చొప్పు పెంచుతూ బుధవారం రాత్రి చమురు సంస్థలు నిర్ణయించాయి. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొన్నాయి.

దీంతో సిలిండర్ 14 కేజీల ధర ఏకంగా 846 రూపాయలకు చేరింది. ఫిబ్రవరిలో మొత్తం మూడు సార్లు గ్యాస్ ధరలను పెంచింది మోడీ సర్కార్. 4వ తేదీన రూ.25 పెంచగా.. 15న రూ.50 పెంచింది. తాజాగా రూ.25 పెంచడంతో సామాన్యులపై తీవ్ర ప్రభావం పడుతోంది. నెలలోనే ఏకంగా రూ.100 పెంచి సామాన్యుల నడ్డి విరిచింది మోడీ సర్కార్.

ఇక సంవత్సరానికే నిత్యావసరాల ధరలు చుక్కలను అంటాయి. 50-80 రూపాయలు ఉన్న పప్పులు, గోధుమలు, నూనెల ధరలు ఇప్పుడు ఏకంగా రూ.50-100 రూపాయల వరకు పెరిగాయి.ఇంత పెరుగుతున్నా.. ప్రజలు గగ్గోలు పెడుతున్నా కూడా కేంద్రంలోని మోడీ సర్కారు కు మాత్రం చీమకుట్టినట్టైనా అనిపించడం లేదు.

ఏమైనా నిలదీస్తే.. ప్రశ్నిస్తే వారిపై దేశద్రోహి అన్న ముద్రవేసేస్తున్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నిస్తే వాడు భారతీయుడు కావడం లేదు ఈ దేశంలో.. అలా దేశం కోసం.. ధర్మం కోసం చచ్చినట్టు భరించాలన్న సిద్ధాంతాన్ని బీజేపీ అమలు చేస్తోంది. బీజేపీని గెలిపించిన పాపానికి ఆ మాత్రం భరించరా అన్నట్టుగా పాలన తయారైంది. అందుకే ఇన్నాళ్లు గొంతెత్తని వారు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో మోడీ'ధరాఘాతాన్ని' కాస్త గట్టిగానే వ్యతిరేకిస్తున్నారు. పోస్టులతో ఏకిపారేస్తున్నారు.